వారసుడిని వెంటాడుతున్న బ్యాడ్ లక్..!
ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో దేశభక్తి కథతో వచ్చిన ఈ సినిమా మొదలు పెట్టడం బాగానే మొదలు పెట్టినా తర్వాత ఎమోషనల్ సీన్స్ తో మెప్పించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.
By: Tupaki Desk | 27 July 2025 3:00 PM ISTబాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నాదానియాన్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేసిన ఇబ్రహీం తొలి సినిమా నదానియాన్ తో సర్ ప్రైజ్ చేశాడు. నదానియాన్ తో ఇంప్రెస్ చేయలేకపోయిన ఇబ్రహీం రీసెంట్ గా సర్జమీన్ తో వచ్చాడు. పృధ్విరాజ్ సుకుమారన్, కాజోల్ నటించిన సర్జమీన్ సినిమా రీసెంట్ గా డైరెక్ట్ ఓటీటీ రిలీజైంది.
సర్జమీన్ ఓటీటీ రిలీజ్..
ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో దేశభక్తి కథతో వచ్చిన ఈ సినిమా మొదలు పెట్టడం బాగానే మొదలు పెట్టినా తర్వాత ఎమోషనల్ సీన్స్ తో మెప్పించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ మిస్ చేసి ఓటీటీ ఎందుకు రిలీజ్ చేశారో సినిమా చూశాక తెలుస్తుంది. సర్జమీన్ సినిమా తో ఇబ్రహిం అలీ ఖాన్ సక్సెస్ అందుకుంటాడని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది.
సర్జమీన్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయితే మాత్రం చాలా పెద్ద నష్టాలే ఫేస్ చేయాల్సి వచ్చేది. ఐతే ఓటీటీ రిలీజ్ చేసి మంచి పనిచేశారని చెప్పుకుంటున్నారు. ఇబ్రహీం అలీ ఖాన్ సక్సెస్ ఫుల్ సినిమా ఎప్పుడు వస్తుంది అన్న టెన్షన్ పట్టుకుంది. స్టార్ హీరోల వారసులకి అవకాశాలైతే త్వరగా వస్తాయి కానీ సక్సెస్ మాత్రం వారి టాలెంట్ తోనే వస్తుంది.
దేవర తో సైఫ్ టాలీవుడ్ ఎంట్రీ..
సర్జమీన్ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి సేఫ్ అయినా ఓటీటీ లో కూడా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇబ్రహిం అలీ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. తనయుడి కెరీర్ పై సైఫ్ కాస్త ఫోకస్ చేస్తే తప్పకుండా అతనికి సూపర్ హిట్ సినిమా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
సైఫ్ కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. దేవర తో సైఫ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సైఫ్ కూడా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇబ్రహీం అలీ నెక్స్ట్ దిలర్ సినిమా చేస్తున్నాడు. సర్జమీన్ తో ఆకట్టుకోలేకపోయిన అతడు నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. ఐతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో కాకుండా డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ని అలరించాలని చూస్తున్నాడు ఇబ్రహీం. మరి సైఫ్ నట వారసత్వాన్ని ఇబ్రహిం మునుముందు ఎలా తీసుకెళ్తాడు అన్నది చూడాలి.
