నెపోటిజం పేరుతో బిడ్డను విమర్శించడం మనసుకు సహించలేదు
ఎట్టకేలకు సైఫ్ అలీఖార్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ ఇటీవల ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 May 2025 9:30 AMఎట్టకేలకు సైఫ్ అలీఖార్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ ఇటీవల ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. `నదానియన్` చిత్రంతో లాంచ్ అయ్యాడు. అయితే తొలి సినిమాతోనే ఇబ్రహీం తీవ్ర విమర్శలు ఎదుర్కు న్నాడు. ఇటీవల రిలీజ్ అయిన చిత్రం తేలిపోయింది. ఇబ్రహీం నటన సహా ఏదీ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేదు. గొప్ప నటవారసత్వాన్ని కలిగినా? అదెక్కడా సినిమాలో కనిపించలేదు.
అలాగని కెమెరా కొత్తేం కాదు. చైల్డ్ అర్టిస్ట్ గా ఓ సినిమా చేసాడు. అటుపై ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేసాడు. హీరో అవ్వడానకి ఈ రెండు పనులు చాలా గ్యాప్ ఉన్నప్పటికీ తన సినిమాతో కనీస ప్రభావాన్ని కూడా చూపించలేకపోవడంతో విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో మరోసారి నెపోటిజం అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ వైఫల్యంపై ఇబ్రహీం సహా అతడి తల్లి అమృతా సింగ్ ఎమోషనల్ కారణాన్ని తెరపైకి తెచ్చారు.
ఇబ్రహీం ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి రివీల్ చేసాడు. మెదడు సంబంధిత సమస్యలతో బాధపడినట్లు గుర్తు చేసాడు. దీని కారణంగా వినికిడి నడకవంటి సమస్యలు ఉన్నాయన్నాడు. జీవితాంతం ఈ రెండు సమస్యలతో బాధపడాల్సిందేనన్నాడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారడానికి కొన్నిరకాల చికిత్సలు...స్పీచ్ థెరఫీలు అవసరం అన్నాడు. తరుచూ రిహబిలేషన్ సెంటర్లకు వెళ్తున్నట్లు తెలిపాడు.
ఇబ్రహీం తల్లి అమృతా సింగ్ కూడా కొన్నేళ్ల క్రితం కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై కన్నీళ్లు చెమర్చారు. తన తల్లి మరణం, కుమారుడు అనారోగ్య పరిస్థితి తనని ఎంతగానో కృంగదీసిందని వాపోయారు. సైఫ్ అలీఖాన్ తో విడాకుల సమయంలోనూ పెద్దగా బాధపడలేదన్నారు. కానీ నెపోటిజం పేరుతో బిడ్డను విమర్శించడం మనసుకు సహించలేదని వాపోయారు. విమర్శ అనే భారాన్ని మోయడం ఎంతో బురైందన్నారు.