Begin typing your search above and press return to search.

RR - BGM నాకు హిట్ ఇస్తాయని న‌మ్మ‌ను: చిరంజీవి

చిరంజీవి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. బింబిసార ఫేమ్ వ‌శిష్ఠ తెర‌కెక్కించ‌నున్న‌ ఒక సోషియో-ఫాంటసీ చిత్రంతో తన అభిమానుల ముందుకు వ‌స్తున్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 5:18 AM GMT
RR - BGM నాకు హిట్ ఇస్తాయని న‌మ్మ‌ను:  చిరంజీవి
X

మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా ఎవ‌రినీ విమ‌ర్శించడం ఎప్పుడూ చూడ‌లేదు. ఆయ‌న ప‌రిశ్ర‌మ‌లో జెంటిల్మ‌న్ అన‌డంలో సందేహం లేదు. అయితే వ్య‌వ‌స్థ‌లో లోపాల‌పై మాత్ర‌మే ఆయ‌న మాట్లాడ‌తారు. ఇప్పుడు ఆడియెన్ లో వ‌చ్చిన ఓ మార్పు గురించి స్ప‌ష్ఠంగా మాట్లాడారు. అది కూడా ఆర్.ఆర్- బీజీఎంల‌తో సంగీత ద‌ర్శ‌కులు ఎలాంటి మ్యాజిక్ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావించారు. సినిమా కంటెంట్ లో లోపాన్ని, పాత్ర ఎలివేష‌న్ లోపాన్ని కూడా సంగీత ద‌ర్శ‌కులు ఎలా త‌మ ప్ర‌తిభ‌తో క‌వ‌ర్ చేస్తున్నారో వివ‌రించారు. అయితే త‌న సినిమాల‌కు మాత్రం అలాంటి ఆప్ష‌న్ లేద‌ని, తాను క‌ష్ట‌ప‌డి డ్యాన్సులు, ఫైట్స్ చేస్తేనే అభిమానులు ఆద‌రిస్తార‌ని కూడా అంగీక‌రించారు.

చిరు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లతో సిద్ధంగా ఉన్నారు. ఇంత‌లోనే మీడియాతో తన ఇటీవలి ఇంటరాక్షన్‌లో ఆర్.ఆర్-బీజీఎంల గురించి ప్ర‌స్థావించ‌డం ప‌రోక్షంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఇండస్ట్రీ హిట్ జైలర్ గురించి మాట్లాడినట్లు అనిపించింది. జైలర్ కోసం దర్శకుడు నెల్సన్ మొదటి ఎంపిక మెగాస్టార్ చిరంజీవి అన్న‌ది కొంద‌రికే తెలుసు. కానీ కథనం విన్న తర్వాత చిరంజీవి జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్రతో ముందుకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో చివరికి ప్రాజెక్ట్‌ను తిరస్కరించారు. ఇది ఒక ఏజ్డ్ హీరో పాత్ర.. పైగా అభినయం డ్యాన్సుల‌తో ఉత్తేజపరిచేది ఏమీ లేదు. దీంతో నెల్స‌న్ ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకదానిని కోల్పోయారు! అంటూ ప‌లు వెబ్‌సైట్‌లలో కనిపించింది. భోళా శంకర్ పేరుతో చిరంజీవి `వేదాళం` రీమేక్ లో న‌టించి ఫ్లాప్ కొట్టార‌ని కూడా విమ‌ర్శించారు. జైలర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఒక రోజు తర్వాత రెండిటి పోలిక చాలా లోతుగా క‌నిపించింది. భోళా శంకర్ ఫ్లాప్ సమీక్షలతో తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అదే స‌మ‌యంలో జైల‌ర్ పాజిటివ్ స‌మీక్ష‌ల‌తో హుషారెత్తించింది.

జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్లకు పైగా ఖర్చు చేసి తెర‌కెక్కించ‌గా, రూ. 250 కోట్లకు పైగా వ‌సూలు చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ రిటైర్డ్ జైలర్‌గా, తన కొడుకు అదృశ్యమైన తర్వాత ప‌రిస్థితిని తన చేతుల్లోకి తీసుకునే తాతగా నటించారు. ఇంటరాక్షన్ సమయంలో చిరంజీవి ప‌రోక్షంగా దీనిని ప్ర‌స్థావిస్తూ ఇలా పేర్కొన్నారు, ``నేను కూడా డ్యాన్స్ లు చేయడం.. గూండాలతో పదే పదే పోరాడి అలసిపోయాను. కేవలం స్టైలిష్‌గా నడవడం, RRతో హీరోయిక్ ఎలివేషన్స్ పొందడం, నా మేకప్ తొలగించడం.. వీటితోనే డబ్బు ఇంటికి తీసుకెళ్లడం నాకు వ‌ర్క‌వుట్ కావు. ఇది నా పరిస్థితి..ఇలా కాదు. నేను నటించాలి.. డ్యాన్స్ చేయాలి.. ఫైట్ చేయాలి.. నా శరీరాన్ని హింసించాలి. అప్పుడే నిర్మాతలు సంతోషిస్తారు, దర్శకులు సంతృప్తి చెందుతారు. నా అభిమానులను కూడా అలరిస్తారు. అలా నేను సంతృప్తి చెందాను`` అని గుర్తు చేసారు.

చిరంజీవి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. బింబిసార ఫేమ్ వ‌శిష్ఠ తెర‌కెక్కించ‌నున్న‌ ఒక సోషియో-ఫాంటసీ చిత్రంతో తన అభిమానుల ముందుకు వ‌స్తున్నారు. ఆగస్ట్‌లో చిరంజీవి పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. దీనిని మెగా 157గా పిలుస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి తన సొంత‌ ప్రొడక్షన్ లో పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించే ప్రాజెక్ట్‌కి కూడా సంతకం చేశారు.