Begin typing your search above and press return to search.

హైపర్ ఆది మోస పోయాడట..!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హైపర్‌ ఆది తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   27 April 2024 6:01 AM GMT
హైపర్ ఆది మోస పోయాడట..!
X

జబర్దస్త్‌ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయ్యి, అక్కడ కమెడియన్ గా స్టార్డం దక్కించుకున్నాడు. బుల్లితెరపై వచ్చిన గుర్తింపుతో వెండి తెరపై ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. టీవీ మరియు సినిమా రంగాల్లో కమెడియన్ గా స్టార్‌ డమ్‌ దక్కించుకున్న హైపర్ ఆది కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హైపర్‌ ఆది తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగాను. ఒకసారి అవకాశం కోసం ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ కి వెళ్తే అక్కడ రూ.3000 కట్టమన్నారు. అడిగినంత డబ్బు అక్కడ ఇచ్చి నా ఫోన్‌ నెంబర్ ఇచ్చి వెళ్లాను.

తర్వాత రోజు ఆ ప్రొడక్షన్ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ ఎవరు కనిపించలేదు. నా నుంచి డబ్బులు తీసుకున్న వారికి ఆ ప్రొడక్షన్‌ హౌస్ కి సంబంధం లేదట. దాంతో నేను మోసపోయాను అని తెలుసుకున్నాను. అందుకే అవకాశాల కోసం ప్రయత్నించే వారు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు అని ఆది సలహా ఇచ్చాడు.

మరో సందర్భం గురించి ఆది మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి సెలబ్రిటీతో ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. ఆ ఫోటోను చూసి నేను ఇండస్ట్రీలో అతడికి పరిచయాలు ఉండి ఉంటాయి. నాకు ఆఫర్స్‌ ఇప్పిస్తాడని నమ్మాను. అతడికి ఫోన్ చేస్తే మొదట వంద రూపాయలు రీచార్జ్ చేయి మాట్లాడుదాం అన్నాడు.

రీచార్జ్ కి వంద రూపాయలు లేని వారు కూడా సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను పెట్టుకుని మోసాలకు పాల్పడుతూ ఉంటారని నాకు అప్పుడు అర్థం అయ్యింది. అందుకే ఎవరిని నమ్మకుండా సొంతంగానే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నాను.

జబర్దస్త్‌ లో సైడ్‌ క్యారెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్‌ ఆది ఒకానొక సమయంలో జబర్దస్త్‌ మొత్తంను ఆక్రమించినంత పని చేశాడు. అక్కడ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఢీ డాన్స్ షో ల్లో పాల్గొన్నాడు. బిగ్‌ బాస్ లో కూడా ఆది సందడి చేసిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ కి మరియు జనసేన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా స్టార్‌ క్యాంపెయినర్‌ గా హైపర్ ఆది ఏపీ లో ప్రచారం చేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చినట్లు ఆది ఇటీవల చెప్పుకొచ్చాడు.