Begin typing your search above and press return to search.

పర్మిషన్ తీసుకొని మరీ అందరికి పంచ్ లేసిన ఆది - 2

కొంతమంది అన్నయ్యను పొగిడేసి.. తమ్ముడ్ని తిట్టేస్తుంటారంటూ.. ''వీళ్లు ఎవరంటే తెలివైన శాడిస్టులు. తమ్ముడ్ని తిట్టేసి అన్నయ్యను పొగిడేస్తే సంతోషపడే వ్యక్తా ఆయన

By:  Tupaki Desk   |   7 Aug 2023 4:04 AM GMT
పర్మిషన్ తీసుకొని మరీ అందరికి పంచ్ లేసిన ఆది - 2
X

ఈ టాలీవుడ్ లోనే ఒక డైరెక్టర్ ఉన్నారని.. ఆయన్ను అనే స్థాయి నాకు లేదు. కానీ.. మెగాస్టార్ ను.. పవర్ స్టార్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదంటూ వివాదాస్పద దర్శకుడు వర్మకు పరోక్షంగా చురకలు అంటించేశారు హైపర్ ఆది. ''ఆయన చిన్న పెగ్ వేసినప్పుడు చిరంజీవిని.. పెద్ద పెగ్ వేసినప్పుడు పవన్ కల్యాణ్ ను విమర్శిస్తుంటారు ఆయన. వాళ్లకు చెబుతున్నాను. అర్థం లేని విమర్శలకు క్లాప్స్ రావు. అర్థం లేని సినిమాలకు కలెక్షన్లు రావు. నాకు తెలిసి మీ 'వ్యూహాలు' బెడిసి కొడతాయని నా నమ్మకం. నా గట్టి నమ్మకం. ఏ ప్రభుత్వాలు అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు అవార్డులు ఇచ్చాయో. అవే ప్రభుత్వాలు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ గురించి తప్పుడు ప్రచారాలు చేశాయి. అప్పుడు కూడా భరించాడు.. క్షమించాడు. అది మెగాస్టార్ అంటే' అంటూ చిరంజీవిని తరచూ టార్గెట్ చేసే వారందరిని తన మాటలతో కడిగి పడేశాడు ఆది.

వీళ్లంతా ఒక ఎత్తు అయితే.. మరికొందరు శాడిస్టులు ఉంటారంటూ.. ''చిరంజీవి వారసుడు రాంచరణ్ తేజ్. ఆయన చిరుత చిత్రం ద్వారా అరంగేట్రం చేస్తున్నప్పుడు కొందరు కావాలని.. నోరెత్తి ఏదో ఒకటి మాట్లాడాడు. ఏదైనా సినిమా హిట్ అయితే అది డైరెక్టర్ వల్ల.. ప్లాప్ అయితే రాంచరణ్ వల్ల అని. అప్పుడు వచ్చింది రంగస్థలం అన్న సినిమా. నోరెత్తిన ప్రతి ఒక్కడు చేయెత్తి జైకొట్టాడు. కామెంట్లు చేసిన ప్రతి ఒక్కడు కామ్ అయిపోయారు. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ కాలేదు. అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేదు.

కానీ.. చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. కొణిదెల వెంకట్రావు కు కొణిదెల చిరంజీవి ఎంత పేరు తెచ్చారో.. కొణిదెల చిరంజీవికి అంతకంటే ఎక్కువ పేరు తెచ్చాడు కొణిదెల రాంచరణ్. మెగాస్టార్.. పవర్ స్టార్ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మెగా పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నాడని అనుకోవచ్చు. కానీ.. గ్లోబల్ స్టార్ అని పెట్టుకుంటే వచ్చే పేరు కాదు. ఇక్కడున్న హీరోలందరికి తట్టుకొని.. వాళ్లందరిని నెట్టుకొని.. చిరంజీవి కొడుకుగా పేరు నిలబెట్టుకొని.. ఎంత ఎదిగినా చేతులు కట్టుకొని ఉన్నాడు కాబట్టే ఈ రోజు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్'' అంటూ చెప్పిన వైనం అందరికి ఆకట్టుకుంది.

ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఆది. కొంతమంది అన్నయ్యను పొగిడేసి.. తమ్ముడ్ని తిట్టేస్తుంటారంటూ.. ''వీళ్లు ఎవరంటే తెలివైన శాడిస్టులు. తమ్ముడ్ని తిట్టేసి అన్నయ్యను పొగిడేస్తే సంతోషపడే వ్యక్తా ఆయన? ఒకరోజు భోళా శంకర్ సెట్ లో చిరంజీవిని నేను అడిగా. ఏదో పొలిటికల్ మ్యాటర్ వచ్చి మాట్లాడుతుంటే.. నేను ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడట్లేదు ఆది అన్నాడాయన.

ఎందుకన్నయ్యా అని అడిగితే.. నా తమ్ముడ్ని ఎవడు పడితే వాడు తిడుతుంటే, నేను సహించలేకపోతున్నాననన్నారు. అది తమ్ముడు మీద అన్నయ్యకున్న ప్రేమ. అన్నయ్య అంటే తమ్ముడికి కూడా చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే.. ఆయన్ను అవమానించిన వాళ్లను.. ఆయన వదిలేస్తాడేమో కానీ, తమ్ముడు గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తు పెట్టుకోండి'' అంటూ పవన్ ఏం చేస్తాడో చెప్పారు.

చిరు అన్నదమ్ముల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారంటూ చెప్పిన ఆది.. ''ఎంత చెప్పినా మారని వాళ్లకు మళ్లీ.. మళ్లీ చెబుతున్నా. కొణిదెల వెంట్రావుకు ముగ్గురు కొడుకులు. ఒకరు కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి ఒకరు, అభిమానుల్ని అభిమానిస్తాడు.. శత్రువుల్ని క్షమిస్తాడు. రెండు కొణిదెల నాగేంద్రబాబు. కొంతమంది చిరంజీవి.. పవన్ కల్యాణ్ తో పోల్చి నాగబాబును కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వాళ్లకు చెబుతున్నా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి వల్ల ఎంతమంది ఎదిగారో. టీవీ ఇండస్ట్రీలో మాలాంటి వాళ్లు ఎంతోమంది ఎదిగారు.

నాగబాబు.. అన్నదమ్ముల కోసం అడ్డంగా నిలబడిపోతాడు. అలాంటి వ్యక్తి. మూడు.. కొణిదెల పవన్ కల్యాణ్. అందరి లెక్క తేలుస్తాడు. అనుకున్నది సాధిస్తాడు. ఇది ష్యూర్. అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేసేశారు. తమ్ముడు మొండోడు. ముంచటాలు ఉండవు. తాడోపేడో తెంపటాలే. ఇది ష్యూర్ రాసి పెట్టుకోండి. వీళ్ల ముగ్గురు డబ్బు మీద ఆశలేని వ్యక్తులు. మంచి చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు. ఇలాంటి వారి మీద తప్పుడు రాతలు రాసినా.. కుర్చీ మడత పెట్టి.. అంటూ ఆపిన ఆది.. ఇది కిందిస్థాయి వారికి అర్థం కాదు.. మినిమం డిగ్రీ చేసి ఉండాలి'' అంటూ వ్యాఖ్యానించారు.

వాల్తేరు వీరయ్య మూవీలో బ్రదర్ సెంటిమెంట్ ఎలా అయితే బాగా వర్కువుట్ అయ్యిందో.. భోళా శంకర్ లో సిస్టర్ సెంటిమెంట్ బాగా పండిందన్న ఆయన.. కలెక్షన్ల పేరుతో మరో భారీ పంచ్ వేశారు. ''నిర్మాతలకు రిస్క్ అవసరం లేదని.. ఈ మధ్యన ఎలక్షన్ల గురించి మాట్లాడాల్సిన వారు కలెక్షన్ల గురించి మాట్లాడేస్తున్నారు. వాళ్లు చూసుకుంటారు. ఎంత వచ్చింది.. ఏమిటని. మన కలెక్షన్లు చాలా తక్కువ వచ్చినియంట. అవును.. ఆయన వెనకేసుకున్న కలక్షన్లతో పోలిస్తే.. మన కలక్షన్లు తక్కువే. ఆ ఆస్తులు మనం ఎప్పుడు దాటలేం' అంటూ అల్టిమేట్ పంచ్ వేసి ముక్తాయించారు.