Begin typing your search above and press return to search.

హైపర్ ఆది వాయించుడు ఇలానే ఉంటుంది..!

జబర్దస్త్ హైపర్ ఆది తన పంచుల క్రేజ్ తో సినిమాల్లోకి వచ్చాడు. సినిమాల్లో రైటర్ గా మారుతాడని అనుకుంటే హైపర్ ఆది నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   1 Oct 2023 5:23 AM GMT
హైపర్ ఆది వాయించుడు ఇలానే ఉంటుంది..!
X

జబర్దస్త్ హైపర్ ఆది తన పంచుల క్రేజ్ తో సినిమాల్లోకి వచ్చాడు. సినిమాల్లో రైటర్ గా మారుతాడని అనుకుంటే హైపర్ ఆది నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఛాన్స్ దొరికితే తనలోని రైటర్ ని బయట పెట్టేస్తున్న హైపర్ ఆది మైక్ అందుకుంటే చాలు మోత మ్రోగిపోవాల్సిందే అన్న రేంజ్ లో స్పీచ్ లు ఇస్తున్నాడు. లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తెలుగు సినిమా హీరోలు ఆ తరం అంటే పెద్దాయన ఎన్.టి.ఆర్ దగ్గర నుంచి ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రాం చరణ్, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రవితేజ, నాని నుంచి విజయ్ దేవరకొండ కిరణ్ అబ్బవరం వరకు హీరోల గురించి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు.

సినిమాల మీద ఇంకా చాలా వరకు కొందరికి చెడు అభిప్రాయం ఉందని అలాంటి వారు సినిమాల్లో మంచిని కాకుండా చెడుని తీసుకుంటాడని అన్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో వారికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ గురించి చెప్పిన హైపర్ ఆది ఏ హీరోని వదిలి పెట్టకుండా దుమ్ము దులిపేశాడు. రూల్స్ రంజన్ సినిమాకు అసలు ఆది ఇచ్చిన స్పీచ్ కి సంబంధం ఏంటన్నది కొంతమందికి అర్థం కాదు. కానీ చివరగా సినిమా వల్ల మంచే జరుగుతుంది కానీ చెడు జరగదని చెప్పాడు హైపర్ ఆది.

అంతేకాదు ట్రోల్స్, మీమ్స్, రివ్యూస్ వీరంతా కూడా సినిమా ఇండస్ట్రీలో భాగమే 100 శాతంలో కేవలం 1 పర్సెంట్ వాళ్లు మాత్రం ట్రోల్స్ విషయంలో కొంత ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. కిరణ్ అబ్బవరం మంచి సినిమా తీస్తే పొగడాలి చెడ్డ సినిమా తీస్తే తిడతారు. కానీ ప్రయత్నం చేస్తున్న వారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. సినిమా గురించి అభిప్రాయాలు ఇవ్వాలే తప్ప వారిని పర్సనల్ టార్గెట్ చేసి హర్ట్ అయ్యేలా చేయకూడదని అన్నారు హైపర్ ఆది.

రూల్స్ రంజన్ సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని.. తనతో పాటు సుదర్శన్, వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ బాగా కుదిరిందని. ఈ సినిమా కిరణ్ అబ్బవరం ఖాతాలో ఒక మంచి హిట్ సినిమాగా నిలవాలని అన్నారు హైపర్ ఆది. ఏ.ఎం.రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు హైపర్ ఆది.