కొత్త టెక్నాలజీస్.. హైదరాబాద్ మూవీ లవర్స్ కు పండగే!
ఆ తర్వాత సైబరాబాద్ లోని PVR ఇనోర్బిట్ లో ప్రీమియం లార్జ్ ఫార్మాట్ P[XL]ని ప్రవేశపెట్టాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. డిసెంబర్ 2025 నాటికి మొదలుపెట్టాలని చూస్తున్నారు.
By: Tupaki Desk | 27 July 2025 12:20 PM ISTహైదరాబాద్ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్! బెస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిటీలోని నాలుగు బడా మల్టీప్లెక్సులు రెడీ అవుతున్నాయి. అత్యాధునిక ప్రొజెక్షన్ టెక్నాలజీలతో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆడియన్స్ ను డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు ప్రవేశపెడుతున్న కొత్త ఫార్మాట్స్ తో సందడి చేయనున్నాయి. ఆ సంగతులు మీకోసం..
హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని మాస్ మహారాజ్ రవితేజ, ఆసియన్ సినిమాస్ మధ్య సహకారంతో ART సినిమాస్ సిద్ధమవుతోంది. EPIQ ఫార్మాట్ తో ఆ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. జులై 31వ తేదీన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతోనే మొదలు కానుంది. నగరంలోని బిగ్ స్క్రీన్స్ ఆప్షన్ లో ఇదొకటిగా మారనుందనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అదే సమయంలో ఆసియన్ గ్రూప్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నిర్వహిస్తున్న కొండాపూర్ లోని AMB సినిమాస్ లో కొత్త HDR బార్కో ప్రొజెక్టర్ మొదలు కానుంది. ఆగస్టు 14న వార్ 2 విడుదలకు ముందు స్టార్ట్ కానుంది. హైదరాబాద్ లోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉన్న ఆ మల్టీప్లెక్స్.. మరింతగా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయనుంది.
ఆ తర్వాత సైబరాబాద్ లోని PVR ఇనోర్బిట్ లో ప్రీమియం లార్జ్ ఫార్మాట్ P[XL]ని ప్రవేశపెట్టాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. డిసెంబర్ 2025 నాటికి మొదలుపెట్టాలని చూస్తున్నారు. సిటీలోని అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన ప్లేస్ లో ఉన్న ఆ మల్టీ ప్లెక్స్.. మరింత అధిక- నాణ్యత స్క్రీన్ తో సినీ ప్రియులను మెప్పించనుంది.
చివరగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేతృత్వంలోనే కోకాపేటలోని అల్లు సినీప్లెక్స్ లో 2026 జనవరిలో డాల్బీ సినిమా స్క్రీన్ ప్రారంభం కానుంది. మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం కూడా అదే సమయంలో జరుగుతుంది. డాల్బీ సినిమా భారత్ లోని అరుదైన ఫార్మాట్ లలో ఒకటన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర పశ్చిమ శివారు ప్రాంతాలలో ప్రధాన ఆకర్షణగా అల్లు సినీ ప్లెక్స్ మారవచ్చు. మొత్తానికి మల్టీప్లెక్సుల యజమాన్యాలు.. ప్రేక్షకులను ఆకర్షించడానికి సాంకేతికత, ఫార్మాట్స్ లో పెట్టుబడి పెడుతున్నాయి. సినిమా అనుభవాన్ని ఆకర్షణీయంగా మార్చడమే వారి లక్ష్యంగా తెలుస్తోంది.
