Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : డబుల్ ఎక్స్‌ఎల్‌ అందాలు..!

మోడల్ గా కెరీర్‌ ను ఆరంభించిన హుమా ఖురేషి తక్కువ సమయంలోనే బాలీవుడ్‌ తో పాటు సౌత్ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 11:30 AM GMT
పిక్ టాక్‌ : డబుల్ ఎక్స్‌ఎల్‌ అందాలు..!
X

మోడల్ గా కెరీర్‌ ను ఆరంభించిన హుమా ఖురేషి తక్కువ సమయంలోనే బాలీవుడ్‌ తో పాటు సౌత్ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. అందమైన ఈ అమ్మడు కేవలం హీరోయిన్‌గానే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది.


ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అయినా కూడా ఈ అమ్మడికి ఇంకా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. బొద్దుగుమ్మ అంటూ చాలా మంది ఈ అమ్మడి అందం ను ఆరాధిస్తూ ఉంటారు. మరి కొందరు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ఫిదా అవుతూ సోషల్‌ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తూ ఉంటారు.


తాజాగా ఈ డబుల్‌ ఎక్స్‌ఎల్‌ సినిమా హీరోయిన్‌ షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. అందమైన హుమా ఖురేషి అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటిలాగే వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే అందం తో పాటు ఈమె ఎక్స్ ప్రెషన్స్ కూడా ఫోటోలో కవ్విస్తున్నాయి.


విభిన్నమైన షాడోలో కనిపించి కనిపించకుండా అందంగా కనిపిస్తున్న హుమా ఖురేషి అందాల విందు కు ఎంతటి వారైనా కూడా అబ్బా అనాల్సిందే. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ఒక వైపు రెండు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.