Begin typing your search above and press return to search.

బ్ర‌ద‌ర్‌తో క‌లిసి హీరోయిన్ వ్యాపారం

సినీప‌రిశ్ర‌మ‌లో దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోవాల‌ని అంటారు. ఆ ర‌కంగా సొంత వ్యాపారాలు చేసే ప్ర‌ముఖులు చాలామంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 July 2025 7:00 AM IST
బ్ర‌ద‌ర్‌తో క‌లిసి హీరోయిన్ వ్యాపారం
X

సినీప‌రిశ్ర‌మ‌లో దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోవాల‌ని అంటారు. ఆ ర‌కంగా సొంత వ్యాపారాలు చేసే ప్ర‌ముఖులు చాలామంది ఉన్నారు. క‌థానాయిక‌ల్లో సోన‌మ్ క‌పూర్, అనుష్క శ‌ర్మ‌, న‌య‌న‌తార‌, దీపిక ప‌దుకొనే, స‌మంత‌, ఆలియాభ‌ట్, కాజ‌ల్ అగ‌ర్వాల్.. స‌హా ప‌లువురు ఎంట‌ర్ ప్రెన్యూర్లుగా ఎదుగుతున్నారు. ఇప్పుడు అదే జాబితాలో త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు బాలీవుడ్ అందాల క‌థానాయిక హ్యూమా ఖురేషి ప్లాన్ చేస్తోంది. త‌న సోద‌రుడితో క‌లిసి సొంత బ్యాన‌ర్ ప్రారంభించిన హ్యూమా, సినిమాల నిర్మాణంతో పాటు, ప‌లు రంగాల్లో ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

హ్యూమా తన సోదరుడు సాకిబ్‌తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి, ఇందులో తొలిగా `బేబీ దో డై దో` అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సోద‌రుడితో క‌లిసి ఇత‌ర వ్యాపారాల్లోను ప్ర‌వేశించేందుకు హ్యూమా ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం.

మ‌రోవైపు హ్యూమా ఖురేషి న‌ట‌నా రంగంలోను రాణిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు హ్యూమా పదేళ్ల క్రితం న‌టించిన హిట్ చిత్రం ఖోస్లా కా ఘోస్లాకు సీక్వెల్ లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా స్క్రిప్టు ప‌నులు సాగుతున్నాయి. కాస్టింగ్ ఎంపిక‌లు చేయాల్సి ఉంది. ఈ సినిమాలో దిల్లీ మ‌ధ్య త‌ర‌గ‌తి వెత‌ల్ని, రియ‌ల్ ఎస్టేట్ మోసాల‌ను అద్భుతంగా చూపించారు. అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ త‌దిత‌రులు న‌టించారు. ఇది క‌ల్ట్ క్లాసిక్ జాన‌ర్ లో సెటైరికల్ డ్రామాతో ర‌క్తి క‌ట్టించింది. న‌వంబ‌ర్ లో సీక్వెల్ ని ప్రారంభించి 2026లో విడుద‌ల చేయాల‌నేది ప్లాన్. ఫిలింమేక‌ర్ ఉమేష్ బిష్ణ్ అత‌డి టీమ్ ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ పై ప‌ని చేస్తున్నారు. టి సిరీస్ ఈ సినిమాని నిర్మిస్తోంది. హ్యూమా ఇప్ప‌టికే స్క్రిప్టు విని సంత‌కం చేసింద‌ని స‌మాచారం. హూమా తదుప‌రి య‌ష్ టాక్సిక్ లో కూడా క‌నిపించ‌నుంది. ఓటీటీల్లోను న‌టిస్తూ బిజీగా ఉంది.