Begin typing your search above and press return to search.

ఏంటయ్యా అనిరుధ్.. అసలు గ్యాప్ ఇవ్వవా?

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ శిష్యుడిగా అనిరుధ్‌ రవిచందర్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 May 2024 5:36 AM GMT
ఏంటయ్యా అనిరుధ్.. అసలు గ్యాప్ ఇవ్వవా?
X

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ శిష్యుడిగా అనిరుధ్‌ రవిచందర్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తక్కువ టైమ్ లోనే అనిరుధ్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. హీరో ధనుష్.. అనిరుధ్ ను తన సినిమాల ద్వారా పరిచయం చేయగా ఫస్ట్ మూవీతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు ఈ యువ సంగీత దర్శకుడు.

కోలీవుడ్‌ లో విజయ్, అజిత్, రజనీకాంత్ వంటి టాప్ స్టార్ల సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన అనిరుధ్.. తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేశారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాలకు కూడా సంగీతం అందిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తారక్ దేవర, కమల్ ఇండియన్ 2, అజిత్ విదా ముయార్చి, రజనీకాంత్ కూలీ, AR మురుగదాస్‌ SK23తో పాటు మరిన్ని సినిమాలకు వర్క్ చేస్తున్నారు.

అలా క్షణం తీరిక లేకుండా మ్యూజిక్ వర్క్ తో బిజీగా ఉంటున్న అనిరుధ్.. తాజాగా మరో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అప్ కమింగ్ మూవీ 'కింగ్ ' కు అనిరుధ్ బాణీలు కట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంతోనే షారుఖ్ కూతురు సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రం చేయనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్ గా స్టార్ట్ అవ్వనున్నట్లు సమాచారం.

అంతకుముందు.. అనిరుధ్, షారుఖ్ కాంబోలో వచ్చిన జవాన్ సినిమా మ్యూజికల్ గా కూడా భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అంతా ఫిదా అయిపోయారు. దీంతో అనిరుధ్ టాలెంట్ అండ్ వర్క్ నచ్చి మళ్లీ ఆయనతో కలిసి షారుఖ్ పని చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి అనిరుధ్.. వరుస ఛాన్సులు దక్కించుకుంటున్నారన్నమాట.

అయితే మూవీ టీమ్ లో అనిరుధ్ పేరు ఉంటే చాలు.. మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఊహించుకుంటున్నారు. అంతలా ఆయన తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అనేక సినిమాలకు ఆయన పని చేస్తుండడంతో మ్యూజిక్ క్వాలిటీ ఏమైనా తగ్గుతుందేమోనని కొందరు అనుమానపడుతున్నారు. అలా జరిగే అవకాశమే లేదని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను అనిరుధ్ ఒప్పుకోవడంపై కూడా కొందరు నెట్టింట స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్, రజనీకాంత్ వంటి టాప్ హీరోల సినిమాలు వదులుకోలేక సైన్ చేస్తున్నారా లేక తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఒప్పుకుంటున్నారా అనేది తెలియడం లేదని అంటున్నారు. ఏదేమైనా.. ఏ సినిమా విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అనిరుధ్ పర్ఫెక్ట్ మ్యూజిక్ అందిస్తే చాలు. మరి చూడాలి ఏం జరుగుతుందో.