Begin typing your search above and press return to search.

దీపావ‌ళి ట్రీట్: గ్రీక్ గాడ్ ఫ్యామిలీ ఫ్రేమ్‌లో స‌బా

ఇప్పుడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని హృతిక్ రోషన్ త‌న‌ కుటుంబంతో కలిసి దీపాల పండుగను జరుపుకున్నారు

By:  Tupaki Desk   |   14 Nov 2023 8:21 AM GMT
దీపావ‌ళి ట్రీట్: గ్రీక్ గాడ్ ఫ్యామిలీ ఫ్రేమ్‌లో స‌బా
X

హృతిక్ రోష‌న్- సబా ఆజాద్ ఒక‌రిని విడిచి ఒక‌రు క్ష‌ణమైనా ఉండ‌లేరు. ఇప్పుడు దీపావ‌ళి వేళ కూడా అదే ముచ్చ‌టైన స‌న్నివేశం .. అంద‌మైన దృశ్యం అభిమానుల కంట ప‌డింది. పదే పదే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన స్నేహితురాలు సబా ఆజాద్‌తో కలిసి జాయ్ ఫుల్ పార్టీల్లో చిల్ చేయడానికి త‌న‌తో క‌లిసి ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాడు. ప్రియురాలితో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలకు సంబంధించిన అంద‌మైన ఫోటోలను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూనే ఉంటాడు. విహార‌యాత్ర‌ల‌కు వెళ్లినా లేదా ఔటింగుల‌కు వెళ్లినా ప్రియురాలు త‌న‌తో ఉండాల్సిందే. అంత‌గా హృతిక్ స‌బాతో నిండా ప్రేమ‌లో మునిగిపోయాడు.


ఇప్పుడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని హృతిక్ రోషన్ త‌న‌ కుటుంబంతో కలిసి దీపాల పండుగను జరుపుకున్నారు. అమావాస్య రోజు హృతిక్ ఫ్యామిలీలో స‌బా లైట్నింగ్ కాంతిలా మెరిసింది. హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ అంద‌మైన వేడుకలకు సంబంధించిన ఫోటోల బంచ్ ను షేర్ చేసాడు. "హ్యాపీ దీపావళి.. అందమైన వ్యక్తులు" అంటూ దీనికి క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చాడు.


ఫోటోలలో హృతిక్ -సబా జంట‌గా ఫ్యామిలీ ఫోటోకు ఫోజులిచ్చిన‌ప్పుడు ఎంతో తేజోమ‌యంగా, ప్రకాశవంతమైన చిరునవ్వులు చిందిస్తూ క‌నిపించారు. హృతిక్ నలుపు రంగు కుర్తాలో అందంగా కనిపించగా, సబా ఆకుపచ్చ బ్లౌజ్‌- ఎరుపు రంగు లెహంగాలో ఎంతో సొగ‌సుగా క‌నిపించారు. ఇదే ఫ్రేమ్ లో హృతిక్ ఫ్యామిలీ మొత్తం క‌నిపించారు. హృతిక్ తల్లిదండ్రులు రాకేష్ -పింకీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడి కనిపించగా, కజిన్ పష్మీనా కూడా వారితో ఫ్రేమ్ లో ఒదిగిపోయింది.

గత సంవత్సరం కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలో హృతిక్ రోషన్- సబా ఆజాద్ తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించారు. కెమెరాలకు పోజులిచ్చేటప్పుడు ఒక‌రికొక‌రు చేతులు పట్టుకుని కనిపించారు. వారు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి సిగ్గుపడరు. యువ‌జంట‌ల‌కు ప్రధాన జంట లక్ష్యాలను సెట్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు.

ఇటీవ‌ల ఓ చాటింగ్ సెష‌న్ లో సబాను తన ల‌వ్ లైఫ్ పై గాసిప్పులు బాధిస్తున్నాయా? అని మీడియా ప్ర‌శ్నించ‌గా దానికి ఎంతో ప‌రిణ‌తితో స‌బా స్పందించింది. ఇలాంటివి ఎవ‌రికి తెలియ‌నివి? అంద‌రికీ ఇవి త‌ప్ప‌దు. కానీ ఇది కోర్సులో ఒక భాగమని నేను భావిస్తున్నాను. ఇతరుల జీవితాలపై ప్రజలు తీవ్ర ఆసక్తిని కలిగి ఉంటారు. ఆ విష‌యంలో మనం ఏం చేయ‌గ‌లం? తల దించుకుని ఎవ‌రి ప‌నిలో వారు ఉండ‌డం త‌ప్ప‌! ఇలాంటి స‌మ‌యంలో చిరున‌వ్వుతో ముందుకు కొన‌సాగాలి. ప్రభావితం కాకూడ‌దు. ఇది ఉద్యోగంలో భాగం. నా జీవితంలో నేను పబ్లిక్‌గా ఉండటానికి సంతోషించే ఏకైక భాగం నా పని. నా పనిలో ఇత‌రులు వేలు పెట్ట‌కూడ‌దు.. అని స‌బా వ్యాఖ్యానించారు.

సబాతో డేటింగ్ చేయడానికి ముందు హృతిక్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు సుస్సానే ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. దాదాపు 14 ఏళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయినా కానీ ఈ జంట‌ స్నేహపూర్వక సంబంధాన్ని క‌లిగి ఉన్నారు. వారి పిల్లలకు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. సుస్సానే ప్రస్తుతం అర్స్లాన్ గోనితో సంబంధంలో ఉంది.