Begin typing your search above and press return to search.

మాజీల స్నేహం విడిపోయిన జంట‌ల‌కు స్ఫూర్తి

ఫైట‌ర్ ట్రైల‌ర్ విడుదలకు ముందు హృతిక్ రోషన్, మాజీ భార్య సుస్సానే ఖాన్ కలిసి ఒక ఈవెంట్‌కు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 11:30 AM GMT
మాజీల స్నేహం విడిపోయిన జంట‌ల‌కు స్ఫూర్తి
X

ఫైట‌ర్ ట్రైల‌ర్ విడుదలకు ముందు హృతిక్ రోషన్, మాజీ భార్య సుస్సానే ఖాన్ కలిసి ఒక ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆ ఇద్ద‌రి స్నేహం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. నిజానికి గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్- సుసానే ఖాన్ జంట విడాకుల త‌ర్వాతా స్నేహితులుగా ఉన్నారు. త‌మ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు స‌హ‌త‌ల్లిదండ్రులుగా ప్రేమ‌ను పంచుతున్నారు. అదే స‌మ‌యంలో హృతిక్ ప్ర‌ముఖ గాయ‌ని స‌బా ఆజాద్ తో రిలేష‌న్ లో ఉండ‌గా, అర్స్లాన్ గోనీ అనే బిజినెస్ మేన్ తో సుసానే డేటింగ్ లో ఉన్నారు.

కానీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం చెక్కు చెద‌ర‌లేద‌న‌డానికి ఇప్పుడు మ‌రో ఎగ్జాంపుల్ లైవ్ లో క‌నిపించింది.

ఆదివారం ముంబైలోని జియో గార్డెన్ BKCలో జరిగిన బ్రాండ్ ఈవెంట్‌లో హృతిక్ రోషన్ -సుస్సానే ఖాన్ కలిసి కనిపించారు. ఈ కార్యక్రమంలో మాజీలు ఎంతో చిల్లింగ్ గా న‌వ్వుతూ మాట్లాడుకుంటూ క‌నిపించారు. ఆభరణాలను తనిఖీ చేస్తూ ఒకరితో ఒకరు కబుర్లు కూడా చెప్పుకున్నారు. ఒక ఫోటోగ్రాఫ‌ర్ ఈ ఈవెంట్ నుండి హృతిక్- సుస్సానే ఖాన్‌ల స‌ర‌దా ముచ్చ‌ట్ల‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సుస్సానే వన్ షోల్డర్ డెనిమ్ టాప్ జీన్స్‌లో అందంగా కనిపించగా, హృతిక్ బ్లూ టీ షర్టు డెనిమ్స్ ధరించి, బ్లాక్ జాకెట్ క్యాప్‌తో క‌నిపించాడు. ఈ వీడియోపై అభిమానులు విరుచుకుప‌డ్డారు. ఒక నెటిజ‌న్ ``వారు ఇప్పటికీ చాలా అందంగా కనిపిస్తున్నారు`` అని ఏడుపు ముఖం ఎమోజిని షేర్ చేసాడు. మరొకరు `చాలా స్వీట్` అని రాశారు. ఇంకొకరు, ``ఏమైనా....కానీ ఇద్దరూ కలిసి బాగానే కనిపిస్తున్నారు`` అని వ్యాఖ్యానించారు.

50లోను 30లో ఉన్నావు డార్లింగ్:

హృతిక్ -సుస్సానే విడాకుల తర్వాతా స్నేహితులుగా కొనసాగుతున్నారు. నటి గాయ‌ని సబా ఆజాద్‌తో హృతిక్ డేటింగ్ చేస్తుంటే, సుస్సానే అర్స్లాన్ గోనీతో డేటింగ్ చేస్తోంది. హృతిక్ - సుస్సానే కూడా వారి కుమారులు హ్రేహాన్ - హృదాన్‌లకు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. ఇటీవలే హృతిక్ 50వ పుట్టినరోజు సందర్భంగా సుస్సానే ఓ స్వీట్ నోట్ రాసింది. నోట్‌తో పాటు హృతిక్ తో కుమారుల ఫోటోలు ఉన్న‌ వీడియోను షేర్ చేసింది. అందులో ఇలా ఉంది. ``హ్యాపీయెస్ట్ బర్త్‌డే రై.. మీరు రే మరియు రిడ్జ్‌లకు ఇచ్చే సమృద్ధి జ్ఞానం .. నిబద్ధతతో మీరు నిజంగా `ఫాదర్ ఓషన్`. మీ కలలన్నీ సాకారం చేసుకోండి.. దేవుడు మిమ్మల్ని అపరిమితంగా ఆశీర్వదిస్తాడు... P.S 50 మీకు 30 లాగా కనిపిస్తోంది!!`` అని రాసింది.

హృతిక్ తదుపరి పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఫైటర్‌`లో న‌టిస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొణె క‌థానాయిక‌. ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలోకి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త‌దుప‌రి `వార్ 2`కి హృతిక్ సంతకం చేశాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ విల‌న్ గా న‌టించ‌నున్నారు. ఉన్నారు.