Begin typing your search above and press return to search.

వైరల్‌ : ప్రియురాలితో సూపర్ స్టార్‌ సెల్ఫీ క్లిక్‌

ప్రియురాలితో స్టార్‌ హీరో షేర్ చేసిన ఫోటో అవ్వడంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోటో వైరల్‌ అయింది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 11:00 AM GMT
వైరల్‌ : ప్రియురాలితో సూపర్ స్టార్‌ సెల్ఫీ క్లిక్‌
X

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హృతిక్ రోషన్‌ గత కొన్నాళ్లుగా సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. తన సుదీర్ఘమైన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన హృతిక్‌ రోషన్‌ కొన్నాళ్ల తర్వాత సబా ఆజాద్‌ తో ప్రేమ లో పడ్డాడు. ఇద్దరు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం తో పాటు ఫ్యామిలీ వేడుకల్లో కూడా కనిపించారు.


ప్రస్తుతం వీరిద్దరూ అర్జెంటీనాలో సుందరమైన ప్రదేశం లో చక్కర్లు కొడుతున్నారు. నేడు తెల్లవారు జామున హృతిక్‌ రోషన్ తన ఇన్ స్టాగ్రామ్‌ లో ఈ ఫోటోను షేర్‌ చేయడం జరిగింది. ప్రియురాలితో స్టార్‌ హీరో షేర్ చేసిన ఫోటో అవ్వడంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోటో వైరల్‌ అయింది.

ఇక హృతిక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు. హృతిక్ రోషన్‌ వార్‌ 2 సినిమా లో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబో కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

హిందీ యాక్షన్ సినిమాల్లో వార్‌ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు వార్ 2 కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ ను ఈ సినిమా లో విలన్ గా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.