Begin typing your search above and press return to search.

24 ఏళ్ల కెరీర్ లో 26 చిత్రాలే!

చైల్డ్ ఆర్టిస్ట్ గా..అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టుడిగా తెరంగేట్రం చేసాడు

By:  Tupaki Desk   |   3 Feb 2024 6:38 AM GMT
24 ఏళ్ల కెరీర్ లో 26 చిత్రాలే!
X

బాలీవుడ్ సూప‌ర్ హీరో హృతిక్ రోష‌న్ వెండి తెర అద్భుతాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'క‌హోనా ప్యార్ హై' నుంచి మొన్న‌టి 'ఫైట‌ర్' వ‌ర‌కూ హృతిక్ ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించాడు. 'కోయి మిల్ గ‌యా'...'ల‌క్ష్య' క్రిష్‌'..'ధూమ్' ..'గుజారిష్'..'డాన్' ..'అగ్నిప‌త్'..'సూప‌ర్ 30'..'వార్' లాంటి చిత్రాలు హృతిక్ ని మ‌రింత గొప్ప స్టార్ గా ఆవిష్క‌రించాయి. ఇండ‌స్ట్రీలో 24 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌స్థానం. న‌టుడిగా మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి ముందే ఇండ‌స్ట్రీ ని చ‌దివేసిన న‌టుడు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా..అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టుడిగా తెరంగేట్రం చేసాడు. మ‌రి ఈ స్టార్ హీరో 24 ఏళ్ల కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసాడు? అంటే ఆ నెంబ‌ర్ చాలా చిన్న‌దిగానే క‌నిపిస్తుంది. కేవ‌లం 26 చిత్రాలే చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే ప్ర‌శ్న హృతిక్ ముందుకెళ్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. త‌క్కువ సినిమాలే చేసాన‌ని చాలా మంది అడుగుతున్నారు.

'అందుకు నా స‌మాధాం ఇదే. జీవిత‌మంటే సినిమాలు మాత్ర‌మే కాదు క‌దా. కుటుంబం..పిల్ల‌లు..ఇత‌ర వ్యాప‌కాలు అంటూ చాలానే ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యం ప్ర‌శాంత‌త కావాలి. ప‌నిని ఆస్వాదిం చాలి. అద‌రా బాద‌ర‌గా సినిమాలు చేయ‌డం అస్స‌లు ఇష్టం ఉండ‌దు. ఒక ప్రాజెక్ట్ క‌మిట్ అయితే వంద శాతం మ‌నసు పెట్టి చేయ‌డం నా నైజం. 'పైట‌ర్' సినిమా మొద‌ల‌య్యాక సోష‌ల్ మీడియాకి పూర్తిగా దూర‌మ య్యాను.

ఏడాది పాటు నా స్నేహితుల్ని కూడా క‌ల‌వ‌లేదు. రోజూ రాత్రి 9 గంట‌ల‌కే నిద్ర‌పోయే వాడిని. పాత్ర‌పై దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఇలా ముందుకు సాగాను. ఫైట‌ర్ కోసం పూర్తిగా వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా ప‌క్క‌న‌బెట్టేశా.' అని అన్నారు. హృతిక్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి ఆయ‌న ఎంతో కూల్ ప‌ర్స‌న్ అని తెలుస్తోంది. ఒక సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో సినిమా ఆలోచ‌న మైండ్ లోకి రానివ్వ‌ని న‌టుడు.