Begin typing your search above and press return to search.

హీరో మాజీ భార్య‌ ప్ర‌స్తుత ప్రేయ‌సితో పార్టీ

డీటెయిల్స్ లోకి వెళితే..ఈ ఎపిసోడ్ లో బాలీవుడ్ దిగ్గ‌జాల గురించి తెలుసుకుని తీరాలి.

By:  Tupaki Desk   |   1 April 2024 9:59 AM GMT
హీరో మాజీ భార్య‌ ప్ర‌స్తుత ప్రేయ‌సితో పార్టీ
X

అత‌డు ఆమె నుంచి విడిపోయాడు. అత‌డు - ఆమె ఎవ‌రి దారిన వారు వెళ్లారు. ఆ త‌ర్వాత‌ ఆ ఇద్ద‌రి జీవితాల్లోకి కొత్త‌ వ్య‌క్తులు ప్రవేశించారు. ఇప్పుడు ఆ మూడో వ్య‌క్తితో మాజీ దంప‌తులు ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తున్నారు.. ఇదంతా సామాన్యుల‌కు విచిత్రంగా అనిపించినా కానీ, అక్క‌డ ఇది చాలా కామ‌న్ వ్య‌వ‌హారం!! డీటెయిల్స్ లోకి వెళితే..ఈ ఎపిసోడ్ లో బాలీవుడ్ దిగ్గ‌జాల గురించి తెలుసుకుని తీరాలి.

బాలీవుడ్ కండ‌ల హీరో హృతిక్ రోషన్- స‌బా ఆజాద్ స్నేహం గురించి తెలిసిందే. సుస్సానే నుంచి విడిపోయాక హృతిక్ సంగీత కారిణి కం గాయ‌ని అయిన‌ స‌బాలో ప్రేమ‌ను క‌నుగొన్నాడు. ఈ జంట నిరంత‌ర షికార్లు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే హృతిక్ నుంచి విడిపోయాక సుస్సానే ఖాన్.. అర్ష‌ద్ గోస్లానీ లో ప్రేమ‌ను క‌నుగొంది. ఈ జంట స్నేహానుబంధాన్ని హృతిక్ స్వాగ‌తించ‌గా, స‌బాతో హృతిక్ బంధాన్ని సుస్సానే కూడా మ‌న‌స్ఫూర్తిగా అభినందించింది. విడిపోయాకా క‌లిసి గొప్ప స్నేహానుబంధాన్ని కొన‌సాగిస్తున్న జంట‌గా హృతిక్- సుస్సానే పాపుల‌ర‌య్యారు.

ఇప్పుడు ఈ రిలేషన్ షిప్ మ‌రో లెవ‌ల్ కి చేరుకుంది. ఆ ముగ్గురి క‌నిక‌ట్టు వ్య‌వ‌హారం ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌గా మారుతోంది. అంతగా ఇప్పుడు ఏం జ‌రిగింది? అంటే.... హృతిక్ రోషన్ - సుస్సానే ఖాన్ ల‌ కుమారుడు హ్రేహాన్ కు ఇటీవలే 18 సంవత్సరాలు నిండాయి. హృతిక్ గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్ తో పాటు కుటుంబ సభ్యులు వార‌సుడి పుట్టినరోజును గోవాలో సెల‌బ్రేట్ చేసుకున్నారు. త‌న‌ను పార్టీకి ఆహ్వానించినందుకు సుస్సేన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ స‌బా ఇన్‌స్టాలో ఒక పోస్ట్ ని షేర్ చేసారు.

అలాగే సుస్సానే కూడా స‌బా (స‌బూ అని పిలుస్తుంది) పై ప్రేమ‌ను కురిపిస్తూ ఒక ఫోటోని కూడా షేర్ చేసింది. థాంక్యూ డార్లింగ్ సబూ.. ప్రేమికులందరికీ సూర్యరశ్మిని అందించినందుకు... అని సుస్సానే ప్రేమ‌ను కురిపించారు. సుస్సానే మారుపేరును వెల్లడిస్తూ స‌బా ఇలా రాసింది. ``ధన్యవాదాలు సూజ్ .. ఇది బెస్ట్ టైమ్``అని రాసింది. హృతిక్, జాయెద్ ఖాన్ స‌హా ఇతరులు ఈ పార్టీకి హాజర‌య్యారు.

హ్రేహాన్ పుట్టినరోజు సందర్భంగా, సుస్సానే స‌హా అతిథులు, ఇండ‌స్ట్రీ ప్ర‌జ‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు.

హృతిక్ తో త‌న సంబంధాన్ని అంగీక‌రించేందుకు ప్ర‌జ‌ల‌కు నెటిజ‌నులకు కొంత స‌మ‌యం ప‌ట్టింద‌ని, ఆరంభం కొంత ద్వేషం ప్ర‌ద‌ర్శించార‌ని స‌బా అజాద్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఎవ‌రి జీవితాన్ని వారు జీవించాల‌ని ఇత‌రుల‌పై ద్వేషం త‌గ‌ద‌ని కూడా సూచించింది. ఏది ఏమైనా కానీ, ఇప్ప‌టికి ఆ ద్వేషం అంత‌మైంద‌ని తాజా ప‌రిణామం చెబుతోంది. అయినా ఆన్ లైన్ లో రాగాద్వేషాల‌ను అంత‌గా ప‌ట్టించుకోకూడదు. ఆవేశం, ఆరోప‌ణ‌లు ఇక్క‌డ చాలా స‌హ‌జం.

హృతిక్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఈ సంవత్సరం ప్రారంభంలో సిద్ధార్థ్ ఆనంద్ ఏరియల్ ఫైటర్ డ్రామా-`ఫైటర్‌`లో హృతిక్ పాటీ అనే పాత్రను పోషించాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో క‌లిసి వార్ 2లో న‌టిస్తున్నాడు. అతడు త్వరలో మేజర్ కబీర్ పాత్రతో అభిమానుల‌ను అల‌రించ‌నున్నాడు. సబా గత సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మినీ సిరీస్‌ `హూ ఈజ్ యువర్ గైనక్`లో న‌టించింది. మ్యూజికల్ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్‌లోను కనిపించారు.