Begin typing your search above and press return to search.

RRR నాటు నాటును కొట్టేయాల‌నే..!

హృతిక్ రోషన్ -జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ డ్యాన్సుల్లో నిష్ణాతులు. నాటు నాటుతో తార‌క్ డ్యాన్సుల్లో ఎన‌ర్జీ ఎలాంటిదో ప్ర‌పంచానికి సుప‌రిచిత‌మైంది.

By:  Tupaki Desk   |   22 April 2024 4:33 AM GMT
RRR నాటు నాటును కొట్టేయాల‌నే..!
X

'వార్' చిత్రం 2019లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారీ యాక్షన్ సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా అద్భుత‌మైన సౌండ్‌ట్రాక్ ప‌రంగాను మంచి పేరొచ్చింది. హృతిక్ రోషన్ -టైగర్ ష్రాఫ్ కలిసి డ్యాన్స్ చేసిన 'జై జై శివశంకర్' గీతం ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇద్దరు ఇండ‌స్ట్రీ బెస్ట్ డ్యాన్స‌ర్లు త‌మ హార్ట్‌ని అంకితం చేసి డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు ప్రేక్షకులను ఉర్రూత‌లూగించాయి.

అందుకే యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) వార్ 2 పనిని ప్రారంభించ‌గానే అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ. ఇంత‌లోనే య‌ష్ రాజ్ సంస్థ ప్లానింగ్ అనూహ్యంగా మారింది. ది గ్రేట్ హృతిక్ రోష‌న్ ని ఢీకొట్టేవాడిగా టైగ‌ర్ కాకుండా, ఆర్.ఆర్.ఆర్ స్టార్ ఎన్టీఆర్ ని ఎంపిక చేయ‌డంతో అది హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. ఇద్ద‌రు ఇండియాలోని బెస్ట్ డ్యాన్స‌ర్లు, ఉత్త‌మ న‌టుల క‌ల‌యిక ఇది. దేశ‌వ్యాప్తంగా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇరు ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ఇద్ద‌రు గొప్ప స్టార్ల‌ను క‌లుపుతూ య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగ‌డంపై చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌లే తార‌క్ ముంబైలో హృతిక్ తో పాటు సెట్స్ లో చేరాడు. అప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఏం జ‌రుగుతోందో తెలుసుకోవాల‌న్న ఉత్సాహం అభిమానుల్లో పెరిగింది. తాజా స‌మాచారం మేర‌కు... ఈ సినిమా ఆర్గానిక్‌గా ఇద్దరు మేల్ లీడ్స్ ఆకట్టుకునే పాటకు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ప్రీతమ్ స్వరపరిచిన పాట‌కు ఆ ఇద్ద‌రూ క‌లిసి నృత్యం చేయ‌నున్నార‌ని తెలిసింది. అలాగే ఈ సినిమాకే ఈ పాట‌ అతిపెద్ద హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తుంద‌ని అంచ‌నా.

హృతిక్ రోషన్ -జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ డ్యాన్సుల్లో నిష్ణాతులు. నాటు నాటుతో తార‌క్ డ్యాన్సుల్లో ఎన‌ర్జీ ఎలాంటిదో ప్ర‌పంచానికి సుప‌రిచిత‌మైంది. కాబ‌ట్టి హృతిక్ లాంటి స్పెష‌లిస్ట్ డ్యాన్సర్ తో అత‌డు జ‌త‌క‌డితే ఎలా ఉంటుందో అభిమానుల ఊహ‌కే వ‌దిలేయాలి. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు కోసం చ‌ర‌ణ్ తో క‌లిసి తార‌క్ అద్భుతమైన డ్యాన్సులు చేసాడు. వార్ 2 కోసం హృతిక్ తో అంత‌కుమించిన మ్యాజిక్ చేయాల‌ని ఆశ‌ప‌డుతున్నాడని తెలుస్తోంది. 'వార్'లోని 'జై జై శివశంకర్' పాట‌ను కొట్టేలా... ఆర్.ఆర్.ఆర్ లో 'నాటు నాటు'ను మించేలా వార్ 2లో పాట ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని తెలుస్తోంది.

వార్ 2 కేవ‌లం యాక్ష‌న్ సినిమా మాత్ర‌మే కాదు. ఇది సంపూర్ణమైన ఎంటర్‌టైనర్. ఫైట్లు, పాటలు, ఎమోష‌న్ అన్నీ స‌మ‌పాళ్ల‌లో ఉంటాయ‌ని ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్-హృతిక్ జోడీపై ప్ర‌త్యేక పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వార్ 2లో కియారా అద్వానీ ఒక క‌థానాయిక‌. 14 ఆగస్టు 2025న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ఇది విడుదల కానుంది.