ఆ బాలీవుడ్ హీరోను ఆడియన్స్ అలా యాక్సెప్ట్ చేస్తారా?
అందులో భాగంగానే హృతిక్ ఓ సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టి అందులో స్టార్మ్ అనే వెబ్‌సిరీస్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Jan 2026 5:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఒక సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ తర్వాతి సినిమాలపై చాలా ఎక్కువగా ఉంటుంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు, ప్రతీ నిర్మాతకు, ప్రతీ డైరెక్టర్‌కు, ప్రతీ హీరోయిన్‌కూ ఈ రూల్ వర్తిస్తుంది. సినిమా హిట్ అయితే వారికి మార్కెట్ పెరగడంతో పాటూ నెక్ట్స్ మూవీపై మంచి బజ్ నెలకొంటుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ వారి మార్కెట్ తో పాటూ తర్వాతి సినిమాలపై కూడా ఉంటుంది.
డిజాస్టర్ గా నిలిచిన వార్2
ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పరిస్థితి కూడా అంతే ఉందని తెలుస్తోంది. హృతిక్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ వార్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను తారు మారు చేసింది. వార్2 సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకుని క్రిష్4 కు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకోవచ్చని హృతిక్ ఎంతో ఆశపడ్డారు.
క్రిష్4కు ఫండింగ్ ప్రాబ్లమ్స్
క్రిష్4 మూవీని రాకేష్ రోషన్ రూ.700 కోట్ల బడ్జెట్ తో తీయాలనుకున్నారు. వార్2 హిట్ అయితే క్రిష్4 కోసం పెట్టుబడి పెట్టడానికి ఎంతో మంది క్యూ కట్టేవారు కానీ వార్2 డిజాస్టర్ అవడంతో క్రిష్4 కు ఉన్న ఫండింగ్ ఇబ్బందులు అలానే ఉండిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవనుంది. అందుకే హృతిక్ ఇప్పుడు తన ఫోకస్ ను వేరే సినిమాలపై పెడుతున్నట్టు తెలుస్తోంది.
సొంత బ్యానర్ ను స్థాపించిన హృతిక్
అందులో భాగంగానే హృతిక్ ఓ సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టి అందులో స్టార్మ్ అనే వెబ్‌సిరీస్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటూ హృతిక్ తో హోంబలే ఫిల్మ్స్ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను అనౌన్స్ చేసి ఆరు నెలలవుతుంది కానీ తర్వాత దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే హృతిక్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
డాన్3లో హృతిక్
సూపర్ హిట్ ఫ్రాంచైజ్ డాన్ లో రానున్న డాన్3 సినిమాను హృతిక్ తో చేయాలని ఫర్హాన్ అక్తర్ భావిస్తున్నారట. రీసెంట్ గా దురంధర్ తో సక్సెస్ అందుకున్న రణ్‌వీర్ సింగ్, ప్రస్తుతం దురంధర్2 చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రణ్‌వీర్ డాన్3 చేయాల్సింది కానీ ఇప్పుడా సినిమా నుంచి ఆయన తప్పుకున్నారని, దీంతో ఆ ప్లేస్ లోకి హృతిక్ రానున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
డాన్2లో హృతిక్ గెస్ట్ రోల్ లో కనిపించడంతో ఈ మూవీకి అతనైతే సరిగా ఉంటుందని ఫర్హాన్ భావించారని, అందులో భాగంగానే రీసెంట్ గా హృతిక్ ను కలిసి ఆయన డాన్3 కథను వినిపించారని, హృతిక్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే ఆడియన్స్ హృతిక్ ను కొత్త డాన్ గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.
