Begin typing your search above and press return to search.

WAR2 ఎఫెక్ట్: సూప‌ర్‌స్టార్‌ని వెంటాడుతున్న గ‌తం

500 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా నిర్మించిన వార్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద అత్యంత భారీ డిజాస్ట‌ర్ గా రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   22 Nov 2025 12:42 PM IST
WAR2 ఎఫెక్ట్: సూప‌ర్‌స్టార్‌ని వెంటాడుతున్న గ‌తం
X

500 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా నిర్మించిన వార్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద అత్యంత భారీ డిజాస్ట‌ర్ గా రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. 2025లో అతిపెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఈ చిత్రం ఒక‌టి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిలింస్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించింది. కానీ ఇది ఊహించ‌ని రీతిలో ప‌రాజ‌యం పాలైంది. ఇది కేవ‌లం 236 కోట్ల లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్స్ సాధించ‌డం అతి పెద్ద నిరాశ‌.

ఈ సినిమా పరాజ‌యం నుంచి కోలుకునేందుకు య‌ష్ రాజ్ ఫిలింస్ చాలా ప్ర‌త్యామ్నాయాల‌ను ప్లాన్ చేసింది. ఇక వార్ 2 ఫ‌లితం ఇందులో న‌టించిన స్టార్ల‌ను ఏ రేంజులో ప్ర‌భావితం చేసింది అంటే హృతిక్ ఇప్ప‌టికీ కోలుకోలేక‌పోతున్నాడు. మ‌న జూనియ‌ర్ అయితే అస‌లు వార్ 2 మాట కూడా ఎత్త‌డు. ఇప్పుడు దుబాయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హృతిక్ మొదటిసారిగా ఈ చిత్రం వైఫల్యాన్ని ప్రస్తావించాడు. కొంత కామిక్ గా మాట్లాడినా అత‌డిలో బాధ అంద‌రికీ అర్థ‌మైంది.

తాజాగా దుబాయ్ కోకా కోలా అరీనాలో జ‌రిగిన ఈవెంట్లో హోస్ట్ హృతిక్ ని ..సూప‌ర్ స్టార్, గ్లోబ‌ల్ ఐకాన్ అంటూ పొగిడేస్తున్న స‌మ‌యంలో మైక్ అందుకున్న హృతిక్ మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. మీకు తెలుసా నేను బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిలైన సినిమాలో న‌టించాను.. కాబట్టి అందరి ప్రేమను పొందడం చాలా బాగుంది... థాంక్యూ అని అన్నాడు. ఇదే వేదిక‌పై త‌న 25 ఏళ్ల కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఇన్ని సంవ‌త్స‌రాలుగా ప్రేమ- ఆద‌రాభిమానాలు పొందినందుకు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. అస‌లు నాకు తెలియ‌ని ముఖాలు కూడా న‌న్ను అభిమానిస్తున్నాయి. దానికి ఎప్పుడూ కృత‌జ్ఞుడ‌ను. ప్ర‌తిసారీ ఈ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి వినోదం అందిస్తున్నానో తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోతాను. నేను చాలా విన‌యంగా ఉన్నాను. న‌న్ను మీరంతా ఆద‌రిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు అని అన్నారు. ప్ర‌జ‌ల‌తో త‌న క‌నెక్ష‌న్ త‌నను ఎప్పుడూ ఆశ్చ‌ర్యంతో కూడుకున్న ఆనందానికి గురి చేస్తుంద‌ని హృతిక్ అన్నారు. ప్ర‌జ‌ల‌ను అల‌రించ‌డాన్ని ఎప్ప‌టికీ లైట్ తీసుకోని సూప‌ర్‌స్టార్ ని నేను అనుకుంటున్నాన‌ని విన‌యంగా చెప్పారు హృతిక్.

నిజానికి ప‌బ్లిక్ వేదిక‌ల‌పై `వార్ 2` వైఫల్యాన్ని హృతిక్ అంగీకరించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కబీర్ పాత్ర‌లో న‌టించ‌డానికి కార‌ణాల‌ను చెబుతూ.. నును ప్ర‌తిదీ ప‌ర్ఫెక్ట్ గా చేసాను. అది ఉండాల్సిన విధంగానే ఉంది. నా ప‌నిని స‌రిగ్గానే చేసాను కానీ ప‌రాజ‌యం పాలైంది. విమ‌ర్శ చాలా సుల‌భం. ఇది నాకు తెలుసు.. నేను దానికి అర్హుడిని.. ప్రతి సినిమా హింస గాయం.. ఈ క్షణం సత్యం కోసం నిరంతర శోధన చేయాల్సిన అవసరం లేదు! అని హృతిక్ న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడాడు. జస్ట్ రిలాక్స్ అంటూ దానిని లైట్ తీస్కోమ‌ని చెప్పాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హృతిక్ రోషన్ క్రిష్ 4 తో తొలిసారిగా దర్శకుడిగా మారుతున్నారు. `క్రిష్ 4` వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా సాగుతున్నాయి. ఇది భార‌త‌దేశంలో తెర‌కెక్కుతున్న సినిమాల‌లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నుంద‌ని తెలిసింది. హృతిక్ తండ్రి, ప్ర‌ముఖ నిర్మాత‌ రాకేష్ రోష‌న్ ప్ర‌కారం.. దాదాపు 1000 కోట్లు అంత‌కుమించి దీనికి బ‌డ్జెట్ వెచ్చించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది. దీనికి య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థ కూడా నిధులు స‌మ‌కూర్చ‌నుంది.