Begin typing your search above and press return to search.

'నాటు నాటు'గా వాడేస్తున్న వార్-2

ఆ తర్వాత రీసెంట్ గా హృతిక్ రోషన్ ఇంటికి ఓ స్పెషల్ పోస్టర్ తో కూడిన వాహనాన్ని తారక్ పంపారు. దాని బిల్ బోర్డులో క్రేజీ క్యాప్షన్ కూడా రాయించారు.

By:  M Prashanth   |   7 Aug 2025 10:22 AM IST
నాటు నాటుగా వాడేస్తున్న వార్-2
X

నాటు నాటు.. ఈ సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా ఉన్న మ్యూజిక్ లవర్స్ ను ఎంతో మెప్పించింది. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే. ఇప్పటికప్పుడు ఆ సాంగ్ విన్నా కూడా అంతా ఉర్రూత లాగుతారు. అలాంటి క్రేజ్ ఆ పాట సొంతం.


రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ లోని ఆ సాంగ్ కోసం ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఆ పాటను ఇప్పుడు అప్ కమింగ్ వార్-2 మూవీ మేకర్స్ తెగ వాడేస్తున్నారు. అది కూడా మామూలుగా కాదు ఓ రేంజ్ లోనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ లో చిందులేసిన స్టార్ హీరో ఎన్టీఆర్.. వార్-2లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.


ఆ సినిమాతోనే ఆయన బాలీవుడ్ లోకి సోలోగా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్-2లో బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో స్టార్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఆగస్టు 14వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా హృతిక్, తారక్ సరదాగా గొడవ పడుతూ చేసుకున్న ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఆ తర్వాత రీసెంట్ గా హృతిక్ రోషన్ ఇంటికి ఓ స్పెషల్ పోస్టర్ తో కూడిన వాహనాన్ని తారక్ పంపారు. దాని బిల్ బోర్డులో క్రేజీ క్యాప్షన్ కూడా రాయించారు.

"ఘుంగ్‌ రూ టూట్ జాయేంగే పర్ హమ్సే యే వార్ జీత్ నహీ పాయోగే" (మీ కాళ్లు నొప్పి పెట్టినా మాతో జరిగే యుద్ధంలో గెలవలేరు) అని ఉండగా.. ఇప్పుడు హృతిక్ రోషన్‌ ఎన్టీఆర్‌ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కూడా ఓ పోస్టర్‌తో కూడిన వాహనాన్ని పంపించాడు. దీనిపై తారక్ సోషల్ మీడియా వేదికగా రీసెంట్ గా పోస్ట్ పెట్టారు.

తన బాల్కనీలో నిలబడిన ఫొటోను షేర్ చేశారు. "మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు హృతిక్ సార్.. కానీ ఇది ముగింపు కాదు.. ఆగస్టు 14న నిజమైన యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పుడు కలుద్దాం" అంటూ ఎన్టీఆర్. హృతిక్ పంపిన వాహనంపై నాటు నాటు సాంగ్ గా లాగా ఎంతైనా ఎగురు, కానీ వార్‌ లో గెలిచేది మాత్రం నేనే" అని ఉంది.

ఆ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి తారక్ మూవీకి గాను నాటు నాటును గట్టిగా యూజ్ చేస్తున్నట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతకుముందు వార్-2 మూవీలో హృతిక్, తారక్ కలిసి చేసిన సాంగ్.. నాటు నాటుకు మించి ఉంటుందని ప్రచారం సాగింది. అయితే ఏ హీరో సినిమాకు అయినా ముందు సినిమా అంశాలను యూజ్ చేసుకోవడం కామనే.