వాటిని కాదన్నందుకు హృతిక్ ఆవేదన
ముఖ్యంగా కెరీర్ ఆరంభం నుంచి హృతిక్ వదులుకున్న కొన్ని ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చాడు. ఆ ప్రాజెక్ట్‌ల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
By: Ramesh Palla | 7 Aug 2025 4:00 AM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. వార్ 2 సినిమా ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ అదే పాజిటివ్ బజ్ కంటిన్యూ అయ్యే విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వార్ 2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా హృతిక్ రోషన్ ఇటీవల ఒక చిట్ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ముఖ్యంగా కెరీర్ ఆరంభం నుంచి హృతిక్ వదులుకున్న కొన్ని ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చాడు. ఆ ప్రాజెక్ట్‌ల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
అమీర్ ఖాన్ దిల్ చహ్తా హై
హృతిక్ రోషన్ కెరీర్ ఆరంభంలో 'దిల్ చహ్తా హై' చేయాల్సి ఉంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 2001లో ఆ సినిమా ఛాన్స్ హృతిక్ రోషన్ వద్దకు మొదట వచ్చిందట. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను హృతిక్ చేయలేక పోయాడు. అదే సమయంలో మంచి జోష్ లో ఉన్న అమీర్ ఖాన్ ఆ సినిమాను చేశాడు. అమీర్ ఖాన్ చేసిన దిల్ చహ్తా హై సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాను వదిలేసినందుకు ఖచ్చితంగా హృతిక్ రోషన్ ఫీల్ అవుతూ ఉంటాడని అంతా అనుకుంటూ ఉంటారు. తాజాగా అదే విషయాన్ని గురించి హృతిక్ రోషన్ మాట్లాడుతూ ఆ సినిమాను చేయలేకపోయినందుకు ఖచ్చితంగా బాధగా ఉందని, ఒక మంచి సినిమా మిస్ అయినందుకు చింతించకుండా ఎలా ఉంటామని అన్నాడు.
3 ఇడియట్స్ హృతిక్ రోషన్ చేయాల్సింది
దిల్ చహ్తా హై సినిమా తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చేయాల్సిన '3 ఇడియట్స్' సినిమాను సైతం వదిలేసినట్లు హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా కథ విషయంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్లు హృతిక్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమాను ఆమీర్ ఖాన్ చేయడం, భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తెలిసిందే. 3 ఇడియట్స్ కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఒక గొప్ప సినిమాగా ఇండియన్ సినీ చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి సినిమాను మిస్ అయినందుకు ఖచ్చితంగా చింతిస్తున్నాను అంటూ హృతిక్ రోషన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. మంచి కథలు, మంచి సినిమాలు అప్పుడప్పుడు మిస్ కావడం అందరికీ సహజమే.
వార్ 2 బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం
ఆ రెండు సినిమాలను మిస్ చేసుకున్నందుకు చింతిస్తున్నాను అంటూనే ఆ రెండు సినిమాలు అమీర్ ఖాన్ వంటి మంచి నటుడు చేయడం వల్ల లాభం పొందాయి అని నేను భావిస్తున్నాను అన్నాడు. గొప్ప సినిమాలకు మంచి నటులు అవసరం. ఆ కథలు అమీర్ ఖాన్ కి మరింతగా సెట్ అయ్యాయి అనిపిస్తుందని హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలు నేను చేసి ఉంటే బాగుండేది అని అనుకోవడం తో పాటు అమీర్ ఖాన్ ఆ సినిమాలు చేయడం వల్ల మంచి ఫలితం దక్కింది అనేది ఆయన మాట. వార్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ ఈ సినిమాతో అంతకు మించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటాను అనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా ఖచ్చితంగా రూ.1000 కోట్ల సినిమా అంటున్నారు. మరి ఈ స్పై థ్రిల్లర్ ఏ మేరకు హిట్ అయ్యేనో చూడాలి.
