Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఫేవ‌రెట్ స్టార్‌తో గ్రీక్ గాడ్

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ .. హాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ జాకీచాన్ ని క‌లిసారు. ఇటీవ‌ల విదేశీ వెకేష‌న్ లో ఉన్న హృతిక్ త‌న ఫేవ‌రెట్ హాలీవుడ్ స్టార్ పై అభిమానాన్ని ఎంత‌మాత్రం దాచుకోలేక‌పోయారు.

By:  Tupaki Desk   |   27 Oct 2025 4:45 PM IST
ఫోటో స్టోరి: ఫేవ‌రెట్ స్టార్‌తో గ్రీక్ గాడ్
X

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ .. హాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ జాకీచాన్ ని క‌లిసారు. ఇటీవ‌ల విదేశీ వెకేష‌న్ లో ఉన్న హృతిక్ త‌న ఫేవ‌రెట్ హాలీవుడ్ స్టార్ పై అభిమానాన్ని ఎంత‌మాత్రం దాచుకోలేక‌పోయారు. ఇన్ స్టాలో త‌మ క‌ల‌యిక‌కు సంబంధించిన అంద‌మైన ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసిన హృతిక్ .. దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు.

ఈ ఫోటోగ్రాఫ్స్‌లో హృతిక్ పూర్తిగా తెల్లని దుస్తుల‌లో క‌నిపించ‌గా, మ్యాచింగ్ జీన్స్ వైట్ జాకెట్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపిస్తున్నాయి. జాకీ చాన్ నేవీ బ్లూ లుక్‌లో స్మార్ట్ గా ఉన్నారు. ఆస‌క్తిక‌రంగా ఆ ఇద్దరు స్టార్లు ఒకేలాంటి టోపీలు ధరించడం ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది.

ఈ ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని హృతిక్ అంతే ప్ర‌త్యేక‌మైన సందేశాన్ని జాకీ కోసం పంపాడు. ``ఇక్క‌డ ఇలా మిమ్మల్ని కలవడం ఫ్యాన్సీ సార్. నా విరిగిన ఎముకలు మీ విరిగిన ఎముకలను చూస్తాయి. ఎప్పటికీ.. ఎల్లప్పుడూ!`` అని సందేశాన్ని ఇచ్చాడు. అంకితభావం, పట్టుదలకు మారు పేరైన మార్ష‌ల్ ఆర్ట్స్ కింగ్ జాకీ చాన్‌పై అపార‌మైన గౌర‌వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి వెన‌కాడ‌లేదు హృతిక్.

అత‌డు జాకీ చాన్‌ను కలవడం ఇదే మొదటిసారి కాదు. 2019లో `కాబిల్` చైనా ప్రీమియర్ సందర్భంగా హృతిక్ మొదటిసారి క‌లిసారు. తరువాత 2022లో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కలిసి కనిపించారు. అక్కడి నుంచి వారి ఫోటోలు వేగంగా వైరల్ అయ్యాయి. హృతిక్ ప్ర‌స్తుతం తన స్నేహితురాలు సబా ఆజాద్ తో క‌లిసి విదేశీ వెకేష‌న్‌లో ఉన్నాడు. సబా హృతిక్ తో క‌లిసి ఉన్న అందమైన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హృతిక్ చివరిసారిగా అయాన్ ముఖర్జీ యాక్షన్ చిత్రం `వార్ 2` లో ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించాడు. కియారా అద్వానీ ఇందులో క‌థానాయిక‌. ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చినా, అభిమానులు హృతిక్ నటనను ప్రశంసించారు. HRX ఫిల్మ్స్ బ్యానర్‌లో `స్టార్మ్` అనే థ్రిల్లర్ సిరీస్ తో నిర్మాతగాను ఆరంగేట్ర చేయ‌నున్నారు.