నేను మారా.. మీరూ ట్రై చేయండి
బాలీవుడ్ లో స్టార్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Aug 2025 4:00 AM ISTబాలీవుడ్ లో స్టార్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తున్న ఈయన త్వరలోనే వార్2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆగస్ట్ 14న వార్2 రిలీజ్ కానుండగా ఆ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా హృతిక్ ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ కు ఓ అద్భుతమైన సలహా ఇచ్చారు.
సోషల్ మీడియాకు దూరంగా పలువురు సెలబ్రిటీలు
ఈ మధ్య కాలంలో అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాకు దూరమవడం వల్ల మనలో మనకు తెలియకుండానే ఎన్నో మార్పులొస్తాయని గత కొన్నాళ్లుగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాను కూడా గతంలో సోషల్ మీడయాకు దూరంగా ఉన్నానని హృతిక్ తెలిపారు.
చాలా మార్పొచ్చింది
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఉండటం వల్ల వచ్చే నష్టాలేంటో తనకు తెలుసని చెప్పిన ఆయన ఈ విషయంలో తాను అందరికీ ఓ సలహా ఇచ్చారు. కనీసం వారం రోజుల పాటూ సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ట్రై చేయమని చెప్పారు. అలా చేయడం వల్ల తనలో తెలియని మార్పు చాలా వచ్చిందని, పలు విషయాల్లో తనకు జ్ఞానోదయమైనట్టు చెప్పారు.
కొత్త విషయాలు తెలుసుకోవచ్చు
సోషల్ మీడియాకు దూరంగా ఉంటడం వల్ల వల్ల ఎంతో టైమ్ సేవ్ అవుతుందని, ఆ టైమ్లో మనం ఎన్నో విషయాల గురించి తెలుసుకోవచ్చని హృతిక్ రోషన్ చెప్పారు. కాగా వార్2 సినిమాలోని లవ్ సాంగ్ హుక్ స్టెప్ ను అతని తల్లి ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను హృతిక్ రీసెంట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
భారీ అంచనాలతో రానున్న వార్2
ఇక వార్2 సినిమా విషయానికొస్తే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ వార్ కు సీక్వెల్ గా రూపొందింది. యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ స్పై థ్రిల్లర్ లో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో మొదటి నుంచి వార్2పై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా ఆ అంచనాలను మరింత పెంచింది.
