Begin typing your search above and press return to search.

కొత్త‌గా స్కూల్ కు వెళ్తున్న‌ట్టు ఉంది

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కు న‌టుడిగా ఎంత ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

By:  Tupaki Desk   |   11 April 2025 2:30 PM
కొత్త‌గా స్కూల్ కు వెళ్తున్న‌ట్టు ఉంది
X

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కు న‌టుడిగా ఎంత ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హృతిక్ ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంచైజ్ క్రిష్ కు ఉన్న ఫాలోయింగే వేరు. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్ప‌టికే మూడు పార్ట్ లు రాగా, నాలుగో పార్ట్ కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. అయితే ఈ నాలుగో పార్ట్ ను స్వ‌యంగా క్రిష్ దర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారు.

హీరో నుంచి ద‌ర్శ‌కుడిగా మారుతున్న నేప‌థ్యంలో హృతిక్ తాజాగా ఓ ఈవెంట్ లో ఈ విష‌యంపై మాట్లాడుతూ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచే డైరెక్ష‌న్ అంటే ఇష్ట‌ముంద‌ని, ఆ ఇష్టంతోనే తాను డైరెక్ట‌ర్ ను అవుతున్నాన‌ని కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటేనే భ‌య‌మేస్తుంద‌ని హృతిక్ రోష‌న్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

డైరెక్ష‌న్ రంగం త‌న‌కు పూర్తిగా కొత్త‌ది అవ‌డంతో మ‌ళ్లీ స్కూల్ లో కొత్త‌గా జాయిన్ అవుతున్న‌ట్టు అనిపిస్తోంద‌ని, డైరెక్ట‌ర్ కు ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయో ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుందని, డైరెక్ట‌ర్ గా త‌న‌కు కూడా ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయ‌ని, ఎన్నో అంశాల‌ని ప‌రిశీలించి ముందడుగు వేయాల‌ని, ఫ్యూచ‌ర్ లో అస‌లు డైరెక్ట‌ర్ గా ఎందుకు మారానా అనే ఆలోచన కూడా రావొచ్చ‌ని హృతిక్ అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే ఎన్ని స‌వాళ్లు ఎదురైనా, ఎలాంటి క్లిష్ట ప‌రిస్థితులు ఎదురైనా డైరెక్ట‌ర్ గా వాట‌న్నింటినీ ఎదుర్కోవ‌డానికి తాను రెడీ అయ్యే డైరెక్ట‌ర్ గా జ‌ర్నీని స్టార్ట్ చేస్తున్నాన‌ని, ఆడియ‌న్స్ నుంచి వ‌స్తున్న ప్రేమ‌, స‌హ‌కారాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని హృతిక్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే క్రిష్4కు హృతిక్ డైరెక్ట‌ర్ అని తెలిసిన‌ప్ప‌టి నుంచి క్రిష్4 గురించి ఏ వార్త వినిపించినా నెట్టింట క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది.

క్రిష్ 4 లో హృతిక్ త్రిపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. క్రిష్4 లో హృతిక్ హీరోగానే కాకుండా విల‌న్ గా కూడా క‌నిపించ‌నున్నాడ‌ని, ప‌లు బాలీవుడ్ న‌టులు ఈ మూవీలో క‌నిపించ‌నున్నార‌ని అంటున్నారు. ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, వివేక్ ఒబేరాయ్ ఈ సినిమాలో న‌టించ‌నున్నార‌ని, ఓ కీల‌క పాత్ర‌లో నోరా ఫ‌తేహి క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. రూ.700 కోట్ల భారీ బ‌డ్జెట్ తో క్రిష్‌4 తెర‌కెక్క‌నున్న‌ట్టు స‌మాచారం.