Begin typing your search above and press return to search.

స్టార్ క‌పుల్స్ విడిపోయినా పిల్ల‌లు ఎక్క‌డంటే?

పెద్ద అబ్బాయి అమెరికాలోని ఓ ప్ర‌ఖ్యాత మ్యూజిక్ కాలేజీలో చ‌దువుతున్నాడుట‌. చిన్నోడు మంచి ఆర్టిస్ట్ అట‌. పెయింటింగ్స్ వేయ‌డంలో మంచి ప్రావీణ్యం ఉంద‌న్నారు.

By:  Srikanth Kontham   |   10 Aug 2025 11:52 AM IST
స్టార్ క‌పుల్స్ విడిపోయినా పిల్ల‌లు ఎక్క‌డంటే?
X

హృతిక్ రోషన్-సుస్సానే ఖాన్ దంప‌తులు విడాకుల‌తో వేరైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వేరై తొమ్మి దేళ్లు గ‌డుస్తోంది. ప్ర‌స్తుతం హృతిక్-సుస్సానే ఖాన్ ఎవ‌రి వ్య‌క్తిగ‌త జీవితంలో వారు బిజీగా ఉన్నారు. మ‌రి పిల్ల‌ల బాధ్య‌త ఎవ‌రు తీసుకున్నారు? అంటే పిల్ల‌లిద్ద‌రు హ్రేహాన్, హృదాన్ త‌ల్లి వ‌ద్ద‌నే ఉన్న‌ట్లు వెలు గులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని హృతిక్ రోష‌న్ తాజాగా రివీల్ చేసారు. స‌మయం దొరికిన‌ప్పుడు పిల్ల‌ల వ‌ద్ద‌కు వెళ్లి తండ్రి ప్రేమ‌ను పంచుతున్న‌ట్లు తెలిపారు. షూటింగ్ ల తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఈ మ‌ధ్య కాలంలో వెళ్ల‌లేద‌ని `వార్ 2` రిలీజ్ అనంత‌రం పిల్ల‌ల‌తోనే ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల‌ను కుంటున్న‌ట్లు తెలిపారు.

పెద్ద అబ్బాయి అమెరికాలోని ఓ ప్ర‌ఖ్యాత మ్యూజిక్ కాలేజీలో చ‌దువుతున్నాడుట‌. చిన్నోడు మంచి ఆర్టిస్ట్ అట‌. పెయింటింగ్స్ వేయ‌డంలో మంచి ప్రావీణ్యం ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం పిల్ల‌లు ఇద్ద‌రు చ‌దువుపైనే శ్ర‌ద్ద పెట్టిన‌ట్లు తెలిపారు. చ‌దువు అనంత‌రం వాళ్లు ఇష్ట‌ప‌డిన రంగంలోకి వెళ్లే పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన‌ట్లు హృతిక్ పేర్కొన్నారు. త‌ల్లిదండ్రులుగా పిల్ల‌ల‌కు కావాల్సినంత స్వేచ్ఛ క‌ల్పించామ‌ని...త‌మ‌కున్న ఫ్యాష న్ ని పిల్ల‌లపై రుద్ద‌డం క‌రెక్ట్ కాద‌ని చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత ఇష్ట‌మైన రంగాల‌ను ఎంచుకునే అవ‌కాశం ఉంద‌న్నారు.

తాను సినిమాల్లోకి కూడా అలా వ‌చ్చిన‌ట్లే హృతిక్ గుర్తు చేసుకున్నారు. పేరున్న కుటుంబంలో పుట్టినా చిన్నత‌నంలో తాను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాన్నారు. ఓ ద‌శ‌లో ఇంటి అద్దె కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితుల్లో ఉండేవాళ్ల‌మ‌న్నారు. నాన్న సినిమాల్లో కుదురుకున్నాకే ఆర్దికంగా కుటుంబం మెరుగైన ప‌రిస్థి తుల్లోకి వ‌చ్చింద‌న్నారు. `క‌హో నా ప్యార్ హై` కోసం ఇంటిని కూడా తాక‌ట్టు పెట్టిన‌ట్లు తెలిపారు. న‌టిం చాల‌నే ఆస‌క్తితో సినిమాల్లోకి రావ‌డం ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నే ఆలోచన అన్నీ త‌న స్వీయా నిర్ణ‌యాలే అన్నారు.

`క్రిష్ 4` చిత్రాన్ని తానే స్వ‌యంగా డైరెక్ట్ చేయాల‌ని భావిస్తున్నారుట‌. ఇప్ప‌టికే తండ్రి వ‌ద్ద కొన్ని సినిమా ల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసాన‌న్నారు. అదే అనుభ‌వంతో `క్రిష్ 4` తో కెప్టెన్ కుర్చీ ఎక్కే ఆలోచ‌న రివీల్ చేసారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన క్రిష్ మూడు భాగాలు మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలి సిందే. ప్ర‌స్తుతం `క్రిష్ 4` ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. `వార్ 2` రిలీజ్ అనంత‌రం హృతిక్ క్రిష్ ప‌నుల్లో మ‌రింత బిజీ కానున్నారు.