Begin typing your search above and press return to search.

హృతిక్ కి పోటీగా అమీర్ ఖాన్..?

ఐతే వార్ 2, కూలీల మధ్య జరుగుతున్న ఈ ఫైట్ లో భాగంగానే ముంబైలో కూడా సినిమా ప్రమోషన్స్ లో కూడా పోటీ పడుతున్నారు.

By:  Ramesh Boddu   |   7 Aug 2025 4:00 PM IST
హృతిక్ కి పోటీగా అమీర్ ఖాన్..?
X

ఆగష్టు 14న రెండు భారీ సినిమాల మధ్య గట్టి పోటీ జరగబోతుంది. వార్ 2 అంటూ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి వస్తున్నారు. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయగా యష్ రాజ్ ఫిలింస్ హ్యూజ్ బడ్జెట్ పెట్టి నిర్మించారు. అదే రోజు సూపర్ స్టార్ రజినీ కాంత్ కూలీ కూడా రిలీజ్ అవుతుంది. కూలీ సినిమాలో కింగ్ నాగార్జున విలన్ గా చేయగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పెషల్ క్యామియో రోల్ చేశారు. అమీర్ ఖాన్ చేసిన తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇదే.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో ముంబైలో మెగా ఈవెంట్..

ఐతే వార్ 2, కూలీల మధ్య జరుగుతున్న ఈ ఫైట్ లో భాగంగానే ముంబైలో కూడా సినిమా ప్రమోషన్స్ లో కూడా పోటీ పడుతున్నారు. వార్ 2 కోసం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లతో కలిసి ముంబైలో ఒక మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తుండగా మరోపక్క కూలీ సినిమాకు సంబంధించి కూడా అమీర్ ఖాన్ తో ఒక సర్ ప్రైజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. కూలీ సినిమాలో అమీర్ ఖాన్ పోర్షన్ తోనే నార్త్ సైడ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

కోలీవుడ్ లో చెబుతున్న టాక్ ప్రకారం చూస్తే విక్రం సినిమాలో ఎలాగైతే రోలెక్స్ పాత్రలో సూర్య అలా వచ్చి ఇలా అదరగొట్టారో.. అలా అమీర్ ఖాన్ కూడా మిషన్ గన్ తో వచ్చి దదడలాడిస్తారని అంటున్నారు. ఈ ఎలిమెంట్స్ ని చూపిస్తూ బాలీవుడ్ లో కూడా కూలీ పై స్పెషల్ బజ్ ఏర్పడేలా చేస్తున్నారు.

కూలీని అక్కడ తక్కువ అంచనా వేయలేం..

సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా హిందీలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో కూలీని అక్కడ తక్కువ అంచనా వేయలేం. ఇక రిలీజ్ ముందు అమీర్ ఖాన్ తో కూలీ టీం ప్రమోషన్స్ చేస్తే మరింత రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కూలీ బాలీవుడ్ ఈవెంట్ లో అనిరుద్ కూడా పాల్గొంటాడని తెలుస్తుంది. మొత్తానికి వార్ 2 కి సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ప్రమోషన్స్ వైజ్ కూడా పోటీ ఇస్తుంది కూలీ.

ప్రతి విషయంలో కూలీ వార్ 2ని కాస్త డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఐతే అసలైన మజా ఏంటన్నది రిలీజ్ రోజు తెలుస్తుంది. ఆరోజే ఎవరిది పైచేయి.. ఎవరిది విజయం ఎవరిది ప్రభంజనం అన్న లెక్క తేలుతుంది. ఈ రెండు సినిమాల మీద ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ ఈక్వల్ గా ఉందనిపిస్తుంది. మరి నిజంగానే కూలీ, వార్ 2 మధ్య జరుగుతున్న ఈ టఫ్ ఫైట్ లో ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంది.