తారక్ తో డ్యాన్స్.. హృతిక్ ఏమన్నాడంటే?
ఇప్పుడు ప్రమోషన్స్ తో ఆ విషయంపై హృతిక్ రోషన్ మాట్లాడారు. తారక్ తో వర్క్ చేయడం ఎక్స్ ట్రా ఆర్డనరీ ఎక్స్పీరియన్స్ అని తెలిపారు.
By: M Prashanth | 4 Aug 2025 2:53 PM ISTటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ వార్-2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ పాన్ ఇండియా చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్పై జోనర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇదేనని టాక్!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాతో కోసం అంటు నార్త్ మూవీ లవర్స్ తో పాటు దక్షిణాది సినీ ప్రియులు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అయితే సినిమాలో తారక్, హృతిక్ మధ్య హోరాహోరీ యాక్షన్ సీన్స్ తో పాటు సూపర్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఓ సాంగ్ ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. యష్ రాజ్ స్టూడియోస్ లో రెడీ చేసిన స్పెషల్ సెట్ లో ఆ సాంగ్ ను ఇప్పటికే షూట్ కూడా చేశారు. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా ఆ పాట నిలవనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఆ సాంగ్ కు ప్రీతమ్ స్వరాలందించగా.. బాస్కో మార్టిన్ డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆ పాట కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. డైనమిక్ మూమెంట్ అని చెబుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డ్యాన్సర్స్ అయిన ఎన్టీఆర్, హృతిక్ కలిసి స్టెప్పులేయడం ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.
ఇప్పుడు ప్రమోషన్స్ తో ఆ విషయంపై హృతిక్ రోషన్ మాట్లాడారు. తారక్ తో వర్క్ చేయడం ఎక్స్ ట్రా ఆర్డనరీ ఎక్స్పీరియన్స్ అని తెలిపారు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని చెప్పిన హృతిక్.. చాలా హ్యపీగా ఉందన్నారు. ఆయనతో సాంగ్ విషయానికొస్తే.. ప్రతి స్టెప్ కూడా అద్భుతంగా తారక్ వేశారని హృతిక్ రోషన్ కొనియాడారు.
తారక్ ఇన్క్రెడిబుల్ అని.. ఆయనతో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆయన అన్నారు. తనకు బెస్ట్ కో యాక్టర్ అని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారక్ డ్యాన్స్ టాలెంట్ అంటే అది అని చెబుతున్నారు. వీడియోను ఫుల్ గా వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ సాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే వార్-2తోనే తారక్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నారు. మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు!
