Begin typing your search above and press return to search.

రెజీనాతో 'ఫస్ట్ కిస్' అనుభవం ఎలా ఉందంటే?

2012లోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, పుష్కరకాలంగా హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం కష్టపడుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   10 Feb 2024 12:38 PM GMT
రెజీనాతో ఫస్ట్ కిస్ అనుభవం ఎలా ఉందంటే?
X

చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కథానాయికల్లో అందాల భామ రెజీనా కసాండ్రా కూడా ఉంది. 2012లోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, పుష్కరకాలంగా హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం కష్టపడుతూనే ఉంది. ఈ మధ్య టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు 'ఉత్సవం' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది.


రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఉత్సవం'. అర్జున్ సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాటక కళాకారుల జీవితాల ఇతివృత్తంగా లవ్, ఎమోషన్స్ కలబోసి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌, ది రిహార్సల్ ఆఫ్ ఉత్సవం టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'ఫస్ట్ కిస్' అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేయడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.

'రేయ్.. అదంతా కాదు కానీ, ఆ ఫస్ట్ కిస్ ఫీలింగ్ ఎలా ఉంటదిరా?' అని అడగడంతో ప్రారంభమైన ఈ పాట సినీ ప్రియులను అలరిస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే కథానాయకుడు తన ప్రేయసితో తొలి ముద్దు అనుభవాన్ని వర్ణించే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. రెజీనా అనుకోకుండా అతని పెదవులపై ముద్దు పెట్టుకోవడంతో, దిలీప్ తన సంతోషాన్ని పాట రూపంలో వ్యక్తపరుస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు.

'ఫస్ట్ కిస్' సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాస్ బీట్ తో మాంచి క్యాచీ ట్యూన్ కంపోజ్ చేసారు. దీనికి తగ్గట్టుగానే ఫస్ట్ కిస్ ని డ్రగ్స్ తో, నికోటిన్, ఆల్కహాల్, అమృతంతో పోలుస్తూ యూత్ ని ఆకట్టుకునేలా లిరిక్స్ రాశారు గీత రచయిత అనంత్ శ్రీరామ్. 'మొదటి ముద్దు తగిలినాక.. పెదవి నుంచి నుదిటి దాకా.. నరములన్నీ మెలికి తిరిగి.. ఎడమ నుంచి కుడికి జరిగి..' అంటూ అందరూ పాడుకునేలా తొలి ముద్దు అనుభవాన్ని వివరించారు.

'మామూలుగా ఉండదు మామా.. కిక్కు మామూలుగా ఉండదు మామా.. ఫస్ట్ కిస్ అంటే పండగే బావా' అంటూ సింగర్ రామ్ మిరియాల ఎంతో ఉషారుగా ఆలపించారు. బాబా భాస్కర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్, విజువల్ గానూ బాగుంది. ఇందులో దిలీప్, రెజీనా కసాండ్రా వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా దిలీప్ ప్రకాష్ తన డ్యాన్స్ లతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించారు. ఓవరాల్ గా 'ఫస్ట్ కిస్' సాంగ్ కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే విధంగా ఉందని చెప్పొచ్చు.

'ఉత్సవం' చిత్రంలో దిలీప్, రెజీనాలతో పాటుగా రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాజర్, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా చేస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.