Begin typing your search above and press return to search.

ఎన్నెన్ని గొలుసులు తెంచేస్తున్నావు నాని?

ఇటీవ‌ల రిలీజ్ చేసిన `స‌రిపోదా శ‌నివారం` ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ ఉత్సాహం పెంచుతోంది.

By:  Tupaki Desk   |   23 March 2024 8:26 PM GMT
ఎన్నెన్ని గొలుసులు తెంచేస్తున్నావు నాని?
X

నేచుర‌ల్ స్టార్ నాని చేతికి గొలుసులు చూడ‌గానే.. ఎన్నెన్ని గొలుసుల‌తో బంధించారు.. అయినా అత‌డు భీక‌రంగా గ‌ర్జిస్తున్నాడు జంకూ గొంకూ లేకుండా .. అన్ని బంధ‌నాల‌ను తెంచుకుని అత‌డు ఉరుములా మీద ప‌డుతున్న‌ట్టే అనిపిస్తోంది. నాని క‌థానాయ‌కుడిగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న `సరిపోదా శనివారం` పోస్ట‌ర్ లు విజువ‌ల్స్ తో ఉత్కంఠ పెంచడంలో స‌ఫ‌ల‌మ‌వుతోంది టీమ్‌. `అంటే సుందరానికి` ఫెయిలైనా కానీ, 9ఈ ఇద్దరు స్నేహితులు మ‌రో సినిమాకి క‌లిసి ప‌ని చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.


ఇటీవ‌ల రిలీజ్ చేసిన `స‌రిపోదా శ‌నివారం` ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ ఉత్సాహం పెంచుతోంది. తాజాగా భీక‌ర‌మైన యాక్షన్ మోడ్ లో ఉన్న పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. ఇది హై ఓల్టేజ్ యాక్ష‌న్ సీన్ ని హైలైట్ చేస్తోంది. ఇందులో నాని భీకరంగా క‌నిపిస్తున్నాడు. అత‌డు తీవ్ర ఎమోష‌న్‌లో ఉన్నాడు. చేతికి రక్తపు మరకలు క‌నిపిస్తున్నాయి. ఆ చేతికి ఉన్న‌ గొలుసులను ఎలా విచ్ఛిన్నం చేస్తాడో చూడాల‌నే ఆస‌క్తి అభిమానుల్లో క‌లిగింది.

నానిపై భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కించార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ క‌థానాయిక‌. ఎస్ జె సూర్య కీలక పాత్రధారి. బేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై డివివి దాన‌య్య నిర్మిస్తున్నారు.