Begin typing your search above and press return to search.

స్కామ్ 2003 టాక్ ఏంటి..?

పాపులర్ పీపుల్ బయోగ్రఫీ సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడం కామనే.

By:  Tupaki Desk   |   2 Sep 2023 12:28 PM GMT
స్కామ్ 2003 టాక్ ఏంటి..?
X

పాపులర్ పీపుల్ బయోగ్రఫీ సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడం కామనే. కేవలం ఒక రంగానికి సంబంధించిన వ్యక్తుల గురించే కాకుండా అన్ని రంగాల్లో వ్యక్తుల గురించి.. వారి చేసిన మంచి చెడుల గురించి సినిమాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్ని స్కామ్ ల గురించి కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంటారు. 3 ఏళ్ల క్రితం స్కామ్ 1992 అనే వెబ్ సీరీస్ వచ్చిన విషయం తెలిసిందే. స్టాక్ మార్కెట్ మోసగాడిగా హర్షద్ మెహతా జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను హన్సల్ మెహతా డైరెక్ట్ చేశారు.

స్కామ్1992 వెబ్ సీరీస్ కు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు వచ్చింది. లేటెస్ట్ గా హన్సల్ మెహతా నిర్మాతగా తుషార్ హీరానందిని డైరెక్షన్ లో స్కామ్ 2003 వెబ్ సీరీస్ చేశారు. రెండు దశాబ్దాల క్రితం దేశం మొత్తం సంచలనం సృష్టించిన స్టాంప్ పేపర్ల కుంభకోణం వెనుక అసలు సూత్రధారి తెల్జి జీవితం లోని కీలక అంశాలు.. అప్పటి పరిస్థితును చాలా పర్ఫెక్ట్ గా చూపించారని చెప్పొచ్చు.ఈ స్కామ్ 2003 రీసెంట్ గా సోనీ లివ్ లో రిలీజైంది.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ లేని అబ్దుల్ కరీం తెల్గి (గగన్ దేవ్ రియార్) రైల్లో పండ్లు అమ్ముకుని జీవితం సాగిస్తుంటాడు. అతని టాలెంట్ చూసి షాకత్ ఖాన్ ముంబై రమ్మని చెబుతాడు. తన కష్టాలు గట్టేక్కుతాయని తెల్గి అక్కడకు వెళ్తాడు. అయితే ముంబైలో మొదటిసారి అడుగుపెట్టిన తెల్గి వేల కోట్ల విలువ చేసే స్టాంప్ స్కామ్ ఎలా చేశాదు.. వ్యవస్థకు దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అన్నది ఈ సీరీస్ కథ. సీరీస్ అంతా కూడా 1982 లో మొదలు పెట్టి 2023 దాకా నడిచేలా కథ రాసుకున్నారు.

ఐదు ఎపిసోడ్ లతో స్కామ్ 2003 ఫస్ట్ సీజన్ వచ్చింది. ఒక సామాన్యుడు నాస్తిక్ లో ప్రింట్ అయ్యే స్టాంప్ పేపర్ల రవాణాను కనిపెట్టి వాటి నకిలీ చెలామణిలోకి తీసుకురావడం అందుకోసం ప్రభుత్వ వ్యవస్థను.. పొలిటికల్ లీడర్స్ ను వాడుకోవడం బాగా చూపించారు. కొంత అక్కడక్కడ ల్యాగ్ అయ్యిందని అనిపించినా పర్వాలేదు అనిపిస్తుంది. సీజన్ 1 కేవలం ఎస్టాబ్లిష్ మెంట్ మాత్రమే చూపించారు. తెల్గి చేసిన మోసాలు.. అతను ఎలా దొరికాడు.. దుబాయ్ లో ఏం చేశాడు లాంటివి అన్నీ సీజన్ 2 లో ఉండొచ్చు. స్కామ్ 1992 ఎంగేజ్ చేసినట్టుగా కాకపోయినా స్కామ్ 2003 కూడా మెచ్చుకోదగిన ప్రయత్నమే అని చెప్పొచ్చు.