Begin typing your search above and press return to search.

మోహన్ లాల్ నెరు ఎలా ఉంది..!

అదేంటో తను రాసే ప్రతి కథలో మోహన్ లాల్ నే కథానాయకుడిగా అనుకుంటాడు అనుకుంటా కేవలం ఆయన కోసమే రాసినట్టుగా అనిపిస్తుంటారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:26 PM GMT
మోహన్ లాల్ నెరు ఎలా ఉంది..!
X

కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు ఎప్పుడు వచ్చినా.. ఎన్నిసార్లు వచ్చినా ఆ కాంబో కి ఉన్న క్రేజ్ ని నిలబెడుతుంది. మలయాళంలో ముఖ్యంగా మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే సినిమానే అవుతుంది. దృశ్యం సినిమాలతో అది ప్రూవ్ అయ్యింది. అదేంటో తను రాసే ప్రతి కథలో మోహన్ లాల్ నే కథానాయకుడిగా అనుకుంటాడు అనుకుంటా కేవలం ఆయన కోసమే రాసినట్టుగా అనిపిస్తుంటారు.

కొద్దిపాటి గ్యాప్ తర్వాత మరోసారి మోహన్ లాల్, జీతు జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నెరు. కథ విషయానికి వస్తే అంధురాలైన సారా మహ్మద్ (అనస్వర రాజన్) ఒకడు అత్యాచారం చేస్తాడు. చూపులేని సారాకి శిల్పాలు చెక్కే అలవాటు ఉంటుంది. చేతులతో తాకిన ముఖాలని గీస్తుంది. అలా అలా తనపై అఘాయిత్యానికి కారణమైన అతని బొమ్మ గీస్తుంది. దాని ఆధారంగా మైఖేల్ జోసెఫ్ (శంకర్ ఇందుచూడన్) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు.

ప్రముఖ బిజినెస్ మెన్ కొడుకు అయిన మైఖేల్ ని కేసు నుంచి తప్పించడానికి రాజశేఖర్ (సిద్ధిక్) దిగుతాడు. అయితే ఫస్ట్ హియరింగ్ లోనే మైఖేల్ కి బెయిల్ వస్తుంది. ఈ టైం లో సారా తరపున లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్) కేసు టేకప్ చేస్తాడు. విజయ్ మోహన్ గతం ఏంటి..? సారాకి న్యాయం జరిగిందా..? అన్నది నెరు కథ. జీతు జోసెఫ్ కథ కథనాలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే దృశ్యం సినిమాల కథ వేరుగా ఉంటుంది. నెరు కథనం చాలా భిన్నంగా ఉంటుంది. మొదటి పది నిమిషాల్లో కథ తెలిసిపోయినా సరే నేరాన్ని నిరూపించడం ఎలా నడిపించారన్నది ఆసక్తికరంగా చేశారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలు మాత్రమే పనిచేస్తాయి. అందుకే ఐ విట్నెస్ అని అంటారు. కానీ ఈ కథ అందుకు విరుద్ధంగా నడుస్తుంది.

దర్శకుడు తొలి సన్నివేశం నుంచి ప్రేక్షకులను కథలో కూర్చోబెట్టేలా చేశాడు. కోర్ట్ రూం డ్రామా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమాలో వాదనల్లో సెక్షన్ల గురించి ప్రేక్షకుడికి అవగాహన లేకపోయినా సరే బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అనేది సినిమా అంతా నడిపించేలా చేశాడు. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. జీతు జోసెఫ్, మోహన్ లాల్ కాంబోపై ఉన్న అంచనాలను మరోసారి నెరు ప్రూవ్ చేసింది.