Begin typing your search above and press return to search.

#90s వెబ్ సీరీస్ ఎలా ఉంది..?

#90s వెబ్ సీరీస్ లో శివాజీ వాసుకి లీడ్ రోల్ లో నటించారు. ఈ వెబ్ సీరీస్ ని ఆదిత్యా హాసన్ డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సీరీస్ లో మౌళీ, రోహన్, వాసంతికా నటించారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 4:38 AM GMT
#90s వెబ్ సీరీస్ ఎలా ఉంది..?
X

హీరోగా #90s కి పైగా సినిమాలు చేసిన శివాజీ తన కెరీర్ కి కొంత గ్యాప్ ఇచ్చాడు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 3 గా నిలిచిన శివాజీ హౌస్ లో తన క్లవర్ నెస్ తో ఆడియన్స్ ని మెప్పించాడు. బిగ్ బాస్ నుంచి రాగానే శివాజీ నటించిన #90s వెబ్ సీరీస్ రిలీజైంది. శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే #90s వెబ్ సీరీస్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. టీజర్ ఇంప్రెస్ చేయగా శివాజీ బిగ్ బాస్ నుంచి వచ్చాక #90s ట్రైలర్ ప్రమోషనల్ ఈవెంట్ చేశారు.

#90s వెబ్ సీరీస్ లో శివాజీ వాసుకి లీడ్ రోల్ లో నటించారు. ఈ వెబ్ సీరీస్ ని ఆదిత్యా హాసన్ డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సీరీస్ లో మౌళీ, రోహన్, వాసంతికా నటించారు. కథ విషయానికి వస్తే లెక్కల మస్టారైన శివాజీ, అతని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్ట సుఖాల గురించి ఈ వెబ్ సీరీస్ నడుస్తుంది. ఈమధ్య వెబ్ సీరీస్ లు అన్నీ కూడా థ్రిల్లర్, హారర్ జోనర్ లో వస్తున్నాయి. కంప్లీట్ గా ఒక ఎంటర్టైనింగ్, ఎమోషనల్ సీరీస్ గా #90s వెబ్ సీరీస్ వచ్చింది.

అందుకే టైటిల్ కార్డులోనే ఈ సీరీస్ లో ఎలాంటి ట్విస్టులు ఉండవని క్లారిటీ ఇస్తారు. మధ్యతరగతి సమస్యలు వాటి నుంచి బయటపడే మార్గాలు ఇలా సీరీస్ అంతా అలా సాగిపోతుంది. అక్కడక్కడ కాస్త బోర్ అనిపించినా అది సీరీస్ మీద ఎఫెక్ట్ చూపించదు. ఎంచుకున్న కథ బడ్జెట్ పరిమితులు దృష్ట్యా లొకేషన్స్ తక్కువగా అనిపిస్తాయి. ఐతే ఎమోషనల్ కంటెంట్ ని మాత్రమే నమ్ముకుని ఈ వెబ్ సీరీస్ తీశారు.

రెండు తరాలకు మధ్య వారధిగా చెప్పుకునే 90వ దశకం జ్ఞాపకాలను చూపించే ప్రయత్నం చేశారు. కథ కథనాలు మెప్పించాయి.. నటీనటుల ప్రతిభ ఆకట్టుకుంది. #90S కిడ్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు బాగానే ఉన్నాయి. #90s మిడిల్ క్లాస్ బయోపిక్ అని వచ్చిన ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైంది.