Begin typing your search above and press return to search.

ఇలా రెచ్చిపోతూ లవ్ స్టోరీస్ కావాలంటే ఎలా..?

ఆ సినిమా హిట్ తో తెలుగులో అమ్మడి పాపులారిటీ డబుల్ అయ్యింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 11:30 AM GMT
ఇలా రెచ్చిపోతూ లవ్ స్టోరీస్ కావాలంటే ఎలా..?
X

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో నటించినా సరే పెద్దగా క్రేజ్ తెచ్చుకోని మృణాల్ ఠాకూర్ జెర్సీ రీమేక్ తో మెప్పించింది. అయితే ఆ సినిమా చూశాకే హను రాఘవపుడి డైరెక్షన్లో సీతారామం ఛాన్స్ అందుకుంది అమ్మడు. ఆ సినిమా హిట్ తో తెలుగులో అమ్మడి పాపులారిటీ డబుల్ అయ్యింది. సీతారామం లో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జాహాన్ పాత్రలో మృణాల్ ఠాకూర్ అదరగొట్టేసింది. ఆ సినిమా హిట్ లో ఆమె పర్ఫార్మెన్స్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అందుకే ఆ సినిమాతో అమ్మడికి అంత క్రేజ్ వచ్చింది.

సీతారామం హిట్ తర్వాత హాయ్ నాన్నతో మరో సక్సెస్ అందుకుంది మృణాల్ ఠాకూర్. హాయ్ నాన్న సినిమాలో కూడా ఆమె పర్ఫార్మెన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. టాలీవుడ్ లో నటించిన రెండు సినిమాల్లో మృణాల్ సూపర్ అనిపించుకుంది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో తెలుగులో వస్తున్నట్టుగా తనకు బాలీవుడ్ లో లవ్ స్టోరీస్ రావట్లేదని చెప్పింది. అక్కడ కేవలం రొమాంటిక్ సినిమాలకే తనని తీసుకుంటున్నారని అన్నది. అయితే మృణాల్ అక్కడికి వెళ్తే చాలు ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది.

రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో కూడా మృణాల్ ఠాకూర్ హా**ట్ షో కుర్రాళ్లకి చెటమలు పట్టించేసింది. అక్కడ దర్శక నిర్మాతల దృష్టిలో పడాలని అలా చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడం హీరోయిన్స్ కి కామనే.. కానీ తనకు లవ్ స్టోరీస్ ఇవ్వట్లేదు కేవలం రొమాంటిక్ సినిమాలే ఇస్తున్నారంటూ మళ్లీ మృణాల్ ఇలా తన స్కిన్ తోనే వాళ్లని ఎట్రాక్ట్ చేయాలని అనుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది.

అక్కడ మృణాల్ తనని అలా ప్రొజెక్ట్ చేసుకుంటుంది. అందుకే అమ్మడికి అలాంటి ఆఫర్లు ఇస్తున్నారు. ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో మృణాల్ ని చూసిన ఎవరైనా సరే ఆమెని లవ్ స్టోరీస్ లో నటింప చేయాలని అనుకోరని చెప్పొచ్చు. అఫ్కోర్స్ గ్లామర్ షో అన్నది కూడా హీరోయిన్స్ కెరీర్ లో ఒక భాగమే కానీ ఓ పక్క లవ్ స్టోరీస్ లో తనని ఎందుకు తీసుకోవట్లేదని కామెంట్స్ చేస్తూ ఇలా రెచ్చిపోవడం మాత్రం వెరైటీగా ఉంది. బాలీవుడ్ లో ఏమో కానీ తెలుగులో మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవర్కొండతో ఫ్యామిలీ స్టార్ చేస్తున్న అమ్మడు ఆ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తుందని తెలుస్తుంది. అయితే ఆ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుందట.