Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మరీ అంత క్యూట్‌ గా మూతి పెడితే ఎలా బొల్లమ్మ!

అప్పటి నుంచి కూడా ఈ అమ్మడికి వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల్లో నటించే ఆఫర్లు వస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:57 AM GMT
పిక్ టాక్ : మరీ అంత క్యూట్‌ గా మూతి పెడితే ఎలా బొల్లమ్మ!
X

తెలుగు ప్రేక్షకులకు సమంత, శర్వానంద్‌ జంటగా నటించిన 'జాను' సినిమా తో జానుగా మారిపోయిన ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. ఆ సినిమాలో ఈ అమ్మడిది చిన్న పాత్రే అయినా కూడా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి కూడా ఈ అమ్మడికి వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల్లో నటించే ఆఫర్లు వస్తున్న విషయం తెల్సిందే.


టాలీవుడ్‌ లో కమర్షియల్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవాలి అంటే అందాల ఆరబోత తప్పనిసరి. కానీ ఈ అమ్మడు పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే సింపుల్ గా, క్యూట్‌ అండ్‌ స్వీట్‌ గా చీర కట్టు మరియు సాంప్రదాయ డ్రెస్ ల్లో కనిపిస్తూ కూడా కవ్విస్తూ అలరిస్తోంది. అందుకే టాలీవుడ్ లో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయని మీడియా వర్గాల వారి టాక్‌.


తమిళ్‌ సినీ ఇండస్ట్రీ లో వరుసగా సినిమాలు చేస్తూ కూడా టాలీవుడ్‌ లో వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో హద్దులు దాటే విధంగా అందాల ఆరబోత అయితే చేయదు కానీ.. ఈ అమ్మడు షేర్‌ చేసే క్యూట్‌ అండ్‌ స్వీట్ ఫోటోలు రెగ్యులర్‌ గా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి.

తాజాగా మరోసారి తన కర్లీ హెయిర్ తో మూతి ముందుకు పెట్టి సెల్ఫీ తీసుకుంది. ప్రస్తుతం ఈ క్యూటీ సెల్ఫీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతోంది. వర్ష బొల్లమ్మ ముందు ముందు టాలీవుడ్‌ లో మరింత బిజీ అవ్వాలి అని ఈ ఫోటోలోని ఆమె క్యూట్‌ నెస్ ను చూసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ముద్దు పెట్టినట్టుగా మూతి పెడితే కుర్రకారు ఏమైపోవాలి అమ్మడు అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.