Begin typing your search above and press return to search.

'విశ్వంభ‌ర‌'కు విత్త‌నం అలా!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో `విశ్వంభ‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Aug 2025 6:50 PM IST
విశ్వంభ‌ర‌కు విత్త‌నం అలా!
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో `విశ్వంభ‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత చిరంజీవి న‌టిస్తోన్న సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. మ‌ధ్య‌లో `అంజి` అనే మ‌రో సోషియా ఫాంట‌సీ క‌థ‌ని ట‌చ్ చేసారు. కానీ అది పెద్ద‌గా వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. `జ‌గ‌దీక వీరుడు అతిలోక సుంద‌రి` రేంజ్ లో `అంజి` హిట్ అవుతుంద‌ని భావించారు. కానీ అంచ‌నాలు తారు మార‌య్యా యి. ఆ త‌ర్వాత చిరంజీవి మ‌ళ్లీ ఆ జాన‌ర్ ని ట‌చ్ చేయ‌లేదు. అప్ప‌టి నుంచి ర‌క‌ర‌కాల జాన‌ర్లో స‌క్స‌స్ లు అందుకుంటూ మెగాస్టార్ ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో వ‌శిష్ట రూపంలో `విశ్వంభ‌ర` క‌థ చిరంజీవి ముందుకెళ్ల‌డం ఆయ‌న సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేయ‌డం అంతా వేగంగా జ‌రిగిపోయింది. అస‌లీ ఈ క‌థ‌కు విత్త‌నం ఎలా ప‌డిందంటే? వశిష్ట త‌న చిన్న‌నాటి రోజుల్లోకి వెళ్లిపోయారు. `జ‌గ‌దీక వీరుడు అతిలోక సుంద‌రి` లాంటి సినిమా చిరుతో ఈ స‌మ‌యం లో చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఐడియాతో `విశ్వంభ‌ర` మొద‌లు పెట్టారు. మాయాలోకంలో జ‌రిగే క‌థ‌ల‌కు చిన్న పిల్ల‌లు క‌నెక్ట్ అవ్వ‌డం ఈజీ. తాను బాల్యం లో ఉన్న స‌మ‌యంలో ఆ సినిమాకు ఎంత గానో క‌నెక్ట్ అయిన‌ట్లు? గుర్తు చేసుకున్నారు.

ఆ త‌ర‌హా సినిమాలు ఇంకొంత మంది హీరోలు చేసినా? చిరంజీవి చేయ‌క‌పోవ‌డం అన్న‌ది వ‌శిష్ట మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్సైంది. దీంతో `బింబిసార` త‌ర్వాత చిరంజీవి కోసం వ‌శిష్ట మైండ్ లో ఓ ఐడియా మొదిలింది. `బింబిసార` స‌మ‌యంలోనే చిరంజీవితో చేస్తే ఎలాంటి సినిమా చేస్తావ్ ? అని అడిగేవారట‌. దీంతో వ‌శిష్ట కూడా సోషియా ఫాంట‌సీ జాన‌ర్లో సినిమా చేస్తే బాగుంటుంద‌నే ఐడియాతో మూవ్ అయిన‌ట్లు తెలిపారు.

అదే స‌మ‌యంలో యూవీ క్రియేష‌న్స్ విక్కీని అప్రోచ్ అవ్వ‌డం...ఆయ‌న చిరంజీవి వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డం.. నేరేష‌న్ అనంత‌రం చిరంజీవి ఒప్పుకోవ‌డం అంతా ఓ షాకింగ్ లా జ‌రిగిపోయింద‌న్నారు. చిరంజీవి గారు ఒకే చెప్పినా? అది జ‌రుగుతుందా? లేదా? అన్న టెన్ష‌న్ వెంటాడింద‌న్నారు. చిరు నుంచి క్లియ‌ర్ గా `ఎస్` అనే స‌మాధానం వ‌చ్చే వ‌ర‌కూ ఎగ్జామ్ రాసిన పిల్లాడిలా టెన్ష‌న్ కి గురైన‌ట్లు గుర్తు చేసుకున్నారు.