యానిమల్‌ని అన్నోళ్ల నోళ్లు పడిపోయాయా?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన `యానిమల్` హింస, మహిళలను తక్కువ చేసే సన్నివేశాల కారణంగా చాలా విమర్శలకు గురైంది.
By: Tupaki Desk | 8 Jun 2025 7:00 AM ISTసందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన `యానిమల్` హింస, మహిళలను తక్కువ చేసే సన్నివేశాల కారణంగా చాలా విమర్శలకు గురైంది. చాలా మంది యూట్యూబర్లు, ఫెమినిస్టులు ఈ సినిమా కంటెంట్ ని విమర్శించడమే ధ్యేయంగా జీవించారు.
అయితే ఇప్పుడు `హౌస్‌ఫుల్ 5` వచ్చింది. దిగ్గజాలు నటించిన ఈ సినిమాలోని కొన్ని సీన్ల గురించి చాలా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇందులో అసభ్యత, ఆడాళ్లపై కుళ్లు జోకులు వగైరా పూర్తిగా జుగుప్స కలిగించాయని విమర్శలొస్తున్నాయి. కామెడీ, రోమడీ పేరుతో అడల్ట్ కంటెంట్ అసహ్యం కలిగించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో చాలా భాగం సముద్రంపై క్రూయిజ్ షిప్‌లో సాగే స్టోరి.. దానికి తగ్గట్టు గ్లామర్ ని ఎంతమాత్రం సరిగా వినియోగించుకోలేకపోయారని విమర్శలొస్తున్నాయి. ఈ చిత్రానికి తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. సాజిద్ నదియాద్వాలా నిర్మించారు.
అక్షయ్ కుమార్, సంజయ్ దత్, రితీష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, డినో మోరియా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ, చిత్రాంగద సింగ్, సోనమ్ బజ్వా, సౌందర్య డి పన్హే జాన్, చంకీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే అంత పెద్ద దిగ్గజ స్టార్లు నటించిన ఈ సినిమాలో అసభ్యకర చెత్త సన్నివేశాల కారణంగా తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. యానిమల్ చిత్రానికి ఒక తెలుగువాడు దర్శకత్వం వహించాడు. చాలా విమర్శించారు. ఆ సినిమాలో కొన్ని అసభ్యకర సంభాషణలు ఉన్నా కానీ, అవన్నీ సందర్భానుసారం చాలా ఫన్ ని పుట్టిస్తాయి. చాలా సన్నివేశాల్లో రణబీర్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ రక్తి కట్టిస్తుంది. కానీ ఇక్కడ హౌస్ ఫుల్ లో ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు, నటీనటుల ప్రదర్శన కూడా సరిగా సూట్ కాలేదని సమీక్షకులు విమర్శించారు.
