Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్‌కి డే వన్ క‌లెక్ష‌న్స్ నిరాశే

క‌నీసం 50 కోట్ల నుంచి 100 కోట్ల మ‌ధ్య ఓపెనింగులు సాధిస్తే, ఆ స్టార్ కి అద్భుత‌మైన పాన్ ఇండియా అప్పీల్ ఉంద‌ని అర్థం

By:  Tupaki Desk   |   4 Jun 2025 2:39 PM IST
సూప‌ర్‌స్టార్‌కి డే వన్ క‌లెక్ష‌న్స్ నిరాశే
X

భార‌త‌దేశంలో పాన్ ఇండియా స్టార్ డే వ‌న్ వ‌సూళ్లు సుమారు 100 కోట్లు. క‌నీసం 50 కోట్ల నుంచి 100 కోట్ల మ‌ధ్య ఓపెనింగులు సాధిస్తే, ఆ స్టార్ కి అద్భుత‌మైన పాన్ ఇండియా అప్పీల్ ఉంద‌ని అర్థం. షారూఖ్ ఖాన్ ప‌ఠాన్, జ‌వాన్ చిత్రాల‌తో ఇంచుమించు వ‌ర‌ల్డ్ వైడ్ ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను సాధించాడు.

కానీ ఆ త‌ర్వాత ఎవ‌రూ ఈ స్థాయిని అందుకోలేదు. అమీర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు ఇటీవ‌ల రేసులో వెన‌క‌బ‌డ్డారు. అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న హౌస్ ఫుల్ ఫ్రాంఛైజీ ఐదో సినిమాకి ఇంత పెద్ద స్థాయిని ఊహించ‌లేం కానీ, క‌నీసం 40 కోట్ల ఆరంభ వ‌సూళ్ల‌ను అయినా తేవాల్సిన ప‌రిస్థితి ఉంది. ఈ సినిమా బ‌డ్జెట్ 375 కోట్లు. అంటే బాహుబ‌లి - బాహుబ‌లి 2 రేంజులో బ‌డ్జెట్ ని వెచ్చించారు. దాదాపు 5000 స్క్రీన్ల‌లో సినిమాని విడుద‌ల చేస్తున్నారు. కానీ ఆ స్థాయికి త‌గ్గ వ‌సూళ్ల‌ను ఈ సినిమా సాధిస్తుందా? అంటే ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేదు. మినిమంగా 350-400 కోట్ల మ‌ధ్య నెట్ వ‌సూలు చేస్తేనే ఈ చిత్రం విజ‌యం సాధించిన‌ట్టు.

కానీ ఆరంభ వ‌సూళ్లే నీర‌సంగా 20 కోట్ల లోపు ఉన్నాయ‌ని ట్రేడ్ చెబుతోంది. అంటే ఈ సినిమా రెండు వారాల పాటు కంటిన్యూగా వ‌సూళ్ల‌లో డ్రాప్స్ లేకుండా సాగినా ఆశించిన టార్గెట్ ని చేర‌డం క‌ష్టం. కానీ హౌస్ ఫుల్ 5కి అంత బ‌జ్ ఉన్న‌ట్టు క‌నిపించ‌లేదు. ఈ సినిమా మొదటి వారంలో 100 కోట్లు సాధించ‌డం కూడా క‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే 200కోట్ల న‌ష్టాలు గ్యారెంటీ అన్న గుస‌గుస వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో భారీతారాగ‌ణం దృష్ట్యా ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జ‌రిగింద‌ని తెలుస్తోంది. కానీ థియేట్రిక‌ల్ రిలీజ్ ద్వారా సాధించే వ‌సూళ్ల‌తోనే హిట్టా ఫ్లాపా అన్న‌ది డిసైడ్ చేస్తుంది.

ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ల‌కు ఆశించిన బ‌జ్ రాక‌పోవ‌డం కూడా నీర‌స‌మైన ఓపెనింగుల‌కు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఇక ఎన్న‌డూ లేని విధంగా రెండు విభిన్న‌మైన క్లైమాక్స్ ల‌తో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండ‌డంతో, ఏ క్లైమాక్స్ ఏ థియేట‌ర్ లో ఉంటుందో అనే క‌న్ఫ్యూజ‌న్ ఆడియెన్ లో ఉంది. ఈ ప్ర‌యోగానికి సంబంధించి చిత్ర‌బృందం ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం, పోస్ట‌ర్లు అయినా రిలీజ్ చేయ‌క‌పోవ‌డం డైల‌మాలో ఉంచింది.