Begin typing your search above and press return to search.

హౌస్‌ఫుల్5 ఈసారి క‌ష్ట‌మే!

బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజ్ హౌస్‌ఫుల్ ఐదోసారి బిగ్ స్క్రీన్ పైకి రావ‌డానికి రెడీ అయింది.

By:  Tupaki Desk   |   9 May 2025 12:30 PM
Franchise Fatigue? Housefull 5 Faces Uncertain Future
X

బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజ్ హౌస్‌ఫుల్ ఐదోసారి బిగ్ స్క్రీన్ పైకి రావ‌డానికి రెడీ అయింది. అయితే ఈసారి చిత్ర యూనిట్ మునుప‌టి కంటే పెద్ద హిట్ ను అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. దాని కోసం భారీ స‌న్నాహాలు కూడా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో ఫ్యాన్స్ ఏం చూడాలి? ఏం చూడ‌కూడ‌ద‌నే దానిపై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు కాబ‌ట్టి హౌస్‌ఫుల్5 హిట్ అవుతుంద‌ని క‌చ్ఛితంగా హామీ ఇవ్వ‌లేం.

దీన్ని దృష్టిలో పెట్టుకునే హౌస్‌ఫుల్ 5తో అక్ష‌య్ కుమార్ బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని హిట్ కొట్టాల‌ని టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ అది జ‌ర‌గ‌డానికి చాలా త‌క్కువ ఛాన్సులున్నాయి. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్ బాక్సాఫీస్ వ‌ద్ద గ‌త నాలుగు సీజ‌న్లుగా మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధిస్తోంది. గ‌త నాలుగు సినిమాలుగా స‌గ‌టున ఈ సినిమా 1.5 కోట్ల సంద‌ర్శ‌కుల‌ను సాధించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఫ్రాంచైజ్ 1.75 కోట్ల సంద‌ర్శ‌కుల‌ను దాట‌క‌పోవ‌డం ఆశ్య‌ర్యంగా ఉంది.

హౌస్‌ఫుల్5 ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టి, భారీ క‌లెక్ష‌న్లను న‌మోదు చేసే స‌త్తా క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ఆ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది చిత్ర క‌థాంశ‌మే డిసైడ్ చేస్తుంది. గత కొన్నేళ్లుగా వ‌స్తున్న హౌస్‌ఫుల్ సినిమా స్క్రిప్టుల‌న్నీ మెయిన్ లీడ్స్ యొక్క వీక్ పెర్ఫార్మెన్స్ ల‌తో దాని స్థాయిని అందుకోలేక‌పోయాయి. ఈ కామెడీ మిస్ట‌రీ కోసం నిర్మాత‌లు దాదాపు రూ.375 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

అంత బ‌డ్జెట్ ను మ‌ళ్లీ రాబ‌ట్టుకోవాలంటే క‌నీసం 2 కోట్ల మంది ఆడియ‌న్స్ ఆ సినిమాను చూడాలి. కానీ ప్ర‌స్తుతం అది క‌ష్టంగానే క‌నిపిస్తోంది. రీసెంట్ గా బాక్సాఫీస్ హిస్ట‌రీని ప‌రిశీలిస్తే హౌస్‌ఫుల్ 1 కోటి మందిని కూడా దాటుతుంద‌ని క‌చ్ఛితంగా చెప్ప‌లేం. అయితే కేస‌రి చాప్ట‌ర్2, స్కై ఫోర్స్ సినిమాల్లో అక్ష‌య్ కుమార్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచిన‌ప్ప‌టికీ ఆ సినిమాల‌తో ఆయ‌న మంచి విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయాడు. అక్ష‌య్ కుమార్ ఫామ్ లో లేనందున హౌస్‌ఫుల్5 గ్రాండ్ స‌క్సెస్ అవ‌డం క‌ష్ట‌మే.