జీరోకి పడిపోయిన భారీ మల్టీస్టారర్
సీతారే జమీన్ పార్ ... కంటెంట్ బావుందని ప్రశంసలు కురిసినా కానీ ఇది కల్ట్ జానర్ సినిమా.
By: Tupaki Desk | 23 Jun 2025 8:58 AM ISTఖిలాడీ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ .. లాంటి భారీ తారాగణం నటించింది హౌస్ ఫుల్ 5 చిత్రంలో. బూతు కంటెంట్ కారణంగా చాలా విమర్శలకు గురైనా కానీ, ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ సినిమా. దాదాపు 150 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. తన సినిమా ఏదో ఒక కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించిందని దర్శకుడు అహ్మద్ ఖాన్ సమర్థించుకున్నాడు. బూతు కంటెంట్ పై విమర్శలు వచ్చినా అవన్నీ ఆశీస్సులేనని అన్నాడు.
అయితే ఈ శుక్రవారం నుంచి వసూళ్లు పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యాయి. అమీర్ ఖాన్ నటించిన సీతారే జమీన్ పార్ విడుదలవ్వడంతో ఆ మేరకు ఆ ప్రభావం 'హౌస్ ఫుల్ 5' వసూళ్లపై పడిందని ట్రేడ్ చెబుతోంది. మూడో వారంలో ప్రదర్శితమవుతున్న హౌస్‌ఫుల్ 5 కి ఈ శుక్రవారం వసూళ్లు 1.25 కోట్లు. అంటే పూర్తి కనిష్ఠానికి దిగిపోయింది.
సీతారే జమీన్ పార్ ... కంటెంట్ బావుందని ప్రశంసలు కురిసినా కానీ ఇది కల్ట్ జానర్ సినిమా. అందువల్ల హౌస్ ఫుల్ 5 కలెక్షన్లు తగ్గవని ఊహించారు. కానీ అనూహ్యంగా గ్రాఫ్ పడిపోయింది. అయితే ఈ ఆదివారం కొంతవరకూ తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు. సోమవారం అసలైన టెస్ట్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
