స్వింగ్ లో 'హౌస్ ఫుల్ 5' ప్రీ బుకింగ్స్.. టాప్ చిత్రాలు ఇవే!
హౌస్ ఫుల్ 5.. బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ మూవీ ఇప్పుడు మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 Jun 2025 8:52 PM ISTహౌస్ ఫుల్ 5.. బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ మూవీ ఇప్పుడు మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించిన ఆ సినిమాను సాజిద్ నిదియావాలా గ్రాండ్ గా నిర్మించారు.
అయితే హౌస్ ఫుల్ కామెడీ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. కన్ఫూజన్ క్యారెక్టర్స్, సస్పెన్స్, మిస్టరీ, కామెడీతో అలరించాయి. దీంతో బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కామెడీ మూవీ సిరీస్ గా హౌస్ ఫుల్ నిలిచింది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ నుంచి ఐదో భాగం జూన్ 6వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది.
నాలుగు పార్ట్ లకు మించి హౌస్ ఫుల్ 5 ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. సినీ ప్రియులు.. హౌస్ ఫుల్ 5 మూవీకి గాను పెద్ద ఎత్తున ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు.
నేషనల్ చైన్ స్క్రీన్స్ (ఐనాక్స్, పీవీఆర్, సినీ పోలిస్ వంటివి)లో నేషనల్ వైడ్ గా ఇప్పటి వరకు హౌస్ ఫుల్ 5 మూవీకి రిలీజ్ కు ఒక రోజు ముందు 41 వేలకుపైగా టికెట్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. 90 వేల టికెట్స్ సేల్ అవుతాయని అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నేషనల్ చైన్ స్క్రీన్స్ లో రిలీజ్ కు ఒక్క రోజు ముందు అత్యధిక ప్రీ బుకింగ్స్ జరిగిన హిందీ సినిమాలు ఇవే..
పఠాన్- 419K
జవాన్- 371K
కేజీఎఫ్ (H)- 340K
పుష్ప2 (H)- 245K
యానిమల్- 240K
స్త్రీ 2 - 211K
టైగర్ 3- 191K
డంకి- 152K
గదర్ 2- 150K
చావా- 129K
భూల్ భూలైయా 3- 85K
సికందర్- 82.5K
సింగం అగైన్- 82K
ఫైటర్- 74K
హౌస్ ఫుల్ 5- 41K
అలా నేషనల్ చైన్ స్క్రీన్స్ లో హౌస్ ఫుల్ 5 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా సాగుతున్నాయి. ఓవరాల్ గా కూడా ప్రీ బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో.. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.
