టీజర్ ఇష్యూ.. 25 కోట్ల పరువు నష్టం..
అయితే రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై పాజిటివ్ క్రియేట్ అయింది.
By: Tupaki Desk | 14 May 2025 9:34 PM ISTబాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్ లీడ్స్ రోల్స్ లో హౌస్ ఫుల్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. తరుణ్ మన్ సుఖానీ దర్శకత్వం వహించిన ఆ సినిమాను సాజిద్ నడియాడ్ వాలా నిర్మించారు. సూపర్ హిట్ కామెడీ ఫ్రాంఛైజీ హౌస్ ఫుల్ సిరీస్ లో భాగంగా రూపొందిన ఆ మూవీ.. జూన్ 6వ తేదీన రిలీజ్ కానుంది.
అయితే రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై పాజిటివ్ క్రియేట్ అయింది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా లాల్ పరి సాంగ్ ఇప్పటికే అదిరిపోయే హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ టీజర్ లో మెయిన్ అట్రాక్షన్ గా మారింది.
కానీ మే 9వ తేదీన టీజర్ చూసేందుకు ట్రై చేసిన ఆడియన్స్ ను కాపీరైట్స్ వార్నింగ్ చూపించింది యూట్యూబ్. అందుకు కారణం.. టీజర్ లో ఉన్న లాల్ పరి సాంగ్ పై కాపీరైట్ దావా వచ్చింది. మో ఫ్యూజన్ స్డూడియోస్ సంస్థ ఆ దావా వేసి.. ఆ సాంగ్ హక్కులు తమ వద్ద ఉన్నాయని అందులో పేర్కొంది.
దీంతో యూట్యూబ్.. టీజర్ ను తొలగించింది. అదే సమయంలో సింగర్ యో యో హనీ సింగ్ జోక్యం చేసుకున్నారు. ఆ సాంగ్.. నదేనని తెలిపారు. తాను హౌస్ ఫుల్ మేకర్స్ అయిన నదియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ కు ప్రత్యేకంగా విక్రయించానని రాతపూర్వకంగా ప్రకటన ఇచ్చారు.
అయితే హనీ సింగ్ అధికారిక ప్రకటనతో సాజిద్ నడియాడ్ వాలా అండ్ టీమ్.. మో ఫ్యూజన్ స్టూడియోస్ తోపాటు యూట్యూబ్ పై రూ. 25 కోట్ల పరువు నష్టం దాఖలు చేసింది. టీజర్ ను అన్యాయంగా తొలగించారని నిర్మాణ సంస్థ భావిస్తూ ఆ చర్యలు తీసుకుంది. మే 12న యూట్యూబ్ కు నోటీసు కూడా పంపింది
టీజర్ ను వెంటనే తిరిగి అప్లోడ్ చేయాలని లేదా నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే హౌస్ ఫుల్ టీజర్ విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కంటెంట్ ను తొలగించే ముందు యూట్యూబ్ చెక్ చేయకుండా ఎలా చేస్తుందని అంతా క్వశ్చన్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మూవీపై ఉన్న బజ్ దెబ్బతింటుందని అంటున్నారు. ఏదేమైనా మూవీ టీమ్.. ఇప్పుడు సినిమా వైపు అందరి దృష్టి తిప్పుకోవాలి.
