అక్షయ్ 'హౌస్ ఫుల్ 5'.. రెస్పాన్స్ ఎలా ఉందంటే...
హౌస్ ఫుల్ మూవీ సిరీస్.. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఒకటన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jun 2025 4:07 PM ISTహౌస్ ఫుల్ మూవీ సిరీస్.. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఒకటన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు రాగా.. బాక్సాఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఐదో పార్ట్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. తరుణ్ మన్ సుఖానీ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా గ్రాండ్ గా నిర్మించారు.
బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీష్రాఫ్, నానాపటేకర్ తదితరులు ముఖ్య పాత్రలు యాక్ట్ చేశారు. ఇప్పుడు హౌస్ ఫుల్ 5 మూవీ సంగతేంటి? సినీ ప్రియుల పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
బిలియన్ పౌండ్ల ఆస్తిపరుడు రంజీత్ చనిపోయిన తర్వాత ఆస్తి కోసం కొడుకులుగా జూలియస్ (అక్షయ్ కుమార్), జలా బుద్దీన్ (రితేష్ దేశ్ ముఖ్), జల్ భూషణ్ (అభిషేక్ బచ్చన్) ఎంట్రీ ఇస్తారు. మరి అసలు కొడుకు ఎవరు? ముగ్గురు కలిసి ఏం చేశారు? ఎవరు రంజీత్ ఆస్తిని దక్కించుకున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలే మూవీ.
అయితే అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ కామెడీ టైమింగ్ చోట్ల బాగుందని అనేక మంది నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా, అక్షయ్ కుమార్ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో మెప్పించారని, సినిమాలో ముగ్గురు ప్రధాన నటుల ప్రెజన్స్ తోపాటు హాస్యం మూవీకి ప్లస్ పాయింట్ గా కామెంట్లు పెడుతున్నారు.
టెక్నికల్ గా మాత్రం మేకింగ్ విషయంలో అస్సలు రాజీ పడలేదని అంటున్నారు. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని చెబుతున్నారు. టెక్నికల్ టీమ్ అంతా స్టాండర్డ్ అవుట్ పుట్ ను అందించారని కామెంట్లు పెడుతున్నారు. సాంగ్స్ స్పెషల్ గా లేవని, ఎడిటింగ్ అంతగా బాగాలేదని అంటున్నారు.
అయితే లాజిక్ కోసం కాదని కామెడీ కోసం వెళ్లొచ్చని అంటున్నారు. హౌస్ ఫుల్ సిరీస్ లోని ప్రతీ చిత్రంలో అదే ఉంటుందని, ఇప్పుడు అదే రిపీట్ అయిందని చెబుతున్నారు. కామెడీని రూపొందించడానికి దాదాపు ప్రతి ప్రయత్నంలో రెండు అర్థాలు ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. అది మూవీ స్టార్ట్ అయినే ఐదు నిమిషాలకే తెలుస్తోందని అంటున్నారు.
