Begin typing your search above and press return to search.

మెగా 'విశ్వంభర'లో బాలయ్య రోజ్‌

తాజాగా విశ్వంభర సినిమాలో హనీ రోజ్‌ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి

By:  Tupaki Desk   |   29 Jan 2024 11:30 PM GMT
మెగా విశ్వంభరలో బాలయ్య రోజ్‌
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర' సినిమా గురించిన వార్తలు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు హీరోయిన్‌ విషయమై ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొంది వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో ఒక హీరోయిన్‌ గా హనీ రోజ్ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో హనీ రోజ్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా హీరోయిన్‌ గా ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని కూడా అప్పుడు చర్చ జరిగింది.

తాజాగా విశ్వంభర సినిమాలో హనీ రోజ్‌ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారని, అందులో ఒక హీరోయిన్‌ గా హనీ రోజ్ ను ఎంపిక చేసేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ మలయాళ ముద్దుగుమ్మ అక్కడ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉంది. అక్కడ బిజీగా ఉన్నా కూడా తెలుగు లో ఈమె వీర సింహారెడ్డి సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాలో నటించే అవకాశంను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.