Begin typing your search above and press return to search.

హోంబలే వెనుక పవర్ స్టార్..!

కన్నడలో సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా దూసుకెళ్తుంది హోంబలే ప్రొడక్షన్స్. రీసెంట్ గా ఈ ప్రొడక్షన్ నుంచి ప్రభాస్ నటించిన సలార్ రిలీజైంది

By:  Tupaki Desk   |   26 Dec 2023 10:16 AM GMT
హోంబలే వెనుక పవర్ స్టార్..!
X

కన్నడలో సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా దూసుకెళ్తుంది హోంబలే ప్రొడక్షన్స్. రీసెంట్ గా ఈ ప్రొడక్షన్ నుంచి ప్రభాస్ నటించిన సలార్ రిలీజైంది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ భారీ వసూళ్లతో అదరగొట్టేస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో సలార్ 1 వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో హోంబలె ప్రొడక్షన్స్ వారు సూపర్ హ్యాపీగా ఉన్నారు. అయితే హోంబలే ప్రొడక్షన్స్ ఈ సక్సెస్ వెనుక కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఉన్నారని తెలుస్తుంది.

దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ తోనే హోంబలే ప్రొడక్షన్స్ మొదలైంది. మధ్య అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన విజయ్ ని పునీత్ రాజ్ కుమార్ ఎంకరేజ్ చేశారు. అంతేకాదు తమ బ్యానర్ కు హోంబలే అనే పేరుని కూడా పునీత్ రాజ్ కుమార్ సజెస్ట్ చేశారని. హోంబలమ్మ పేరు మీదుగా ఆ బ్యానర్ పెట్టామని అన్నారు విజయ్. హోంబలే బ్యానర్ లో మొదటి సినిమా పునీత్ రాజ్ కుమార్ హీరోగా నిన్నందలే చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఆ తర్వాత యశ్ తో మాస్టర్ పీస్ చేశారు అది కూడా హిట్ అయ్యింది. మళ్లీ పునీత్ రాజ్ కుమార్ తోనే రాజకుమారా చేస్తే అది కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమాలతో హోంబలే క్రేజ్ పెరిగింది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా చేసిన కె.జి.ఎఫ్ 1, 2 సినిమాల గురించి తెలిసిందే. కన్నడ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని కె.జి.ఎఫ్ తో ప్రూవ్ చేశారు. తమ బ్యానర్ ఇంత సక్సెస్ అయ్యేందుకు ప్రధాన కారణం పునీత్ రాజ్ కుమార్ అని.. ఆయనతో ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారట కానీ ఇంతలోనే పునీత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం తోనే హోంబలే బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా పునీత్ రాజ్ కుమార్ కి నివాళి అందిస్తున్నారని తెలుస్తుంది. సలార్ 1 సీజ్ ఫైర్ తో మరో సూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్న హోంబలె ప్రొడక్షన్ నెక్స్ట్ ఇయర్ కాంతార 2తో మరో సంచలనానికి సిద్ధం అవుతుంది. సలార్ 2 కూడా మరో రెండేళ్లలో సందడి చేసేందుకు సిద్ధం కానుంది.