Begin typing your search above and press return to search.

హోంబలే ఫిల్మ్స్.. నార్త్ టు సౌత్ ఓ రేంజ్ లో..

హోంబలే ఫిల్మ్స్.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఆ బడా నిర్మాణ సంస్థ గురించి అందరికీ తెలిసిందే. కేజీయఫ్‌ 1, కేజీయఫ్‌ 2, కాంతార, సలార్ వంటి భారీ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 11:00 PM IST
హోంబలే ఫిల్మ్స్.. నార్త్ టు సౌత్ ఓ రేంజ్ లో..
X

హోంబలే ఫిల్మ్స్.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఆ బడా నిర్మాణ సంస్థ గురించి అందరికీ తెలిసిందే. కేజీయఫ్‌ 1, కేజీయఫ్‌ 2, కాంతార, సలార్ వంటి భారీ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. ఊహించని బడ్జెట్ తో మూవీలు నిర్మించి సత్తా చాటింది. ఇప్పుడు అనేక ప్రాజెక్టులను నిర్మిస్తూ దూసుకుపోతోంది.

దేశవ్యాప్తంగా కన్నడ సినిమాలను పరిచయం చేస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్.. ఓ రేంజ్ లో ఇప్పుడు తన పరిధిని విస్తరించుకుంటుందని చెప్పాలి. ఇప్పటికే మలయాళం, తెలుగు , తమిళంలోకి రాగా.. రీసెంట్ గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండనుంది.

ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1, యానిమేషన్ మూవీ మహావతార నరసింహ, రక్షిత్ శెట్టి రిచర్డ్ ఆంటోనీ సినిమాలు చేస్తున్న హోంబలే ఫిల్మ్స్.. మాలీవుడ్ లో టైసన్ మూవీ రూపొందిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ కోసం తొలిసారి కలిసిన ఆ సంస్థ.. ఆయనతో మూడు సినిమాలు చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.

అందులో సలార్ సీక్వెల్ మూవీ ఒకటి కాగా.. మరో రెండు సినిమాలు నిర్మించనుంది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో వర్క్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. గతంలో అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ పేర్లు వినిపించగా.. ఊహించని రీతిలో హృతిక్ సినిమాను చేయనున్నట్లు ఇటీవల ప్రకటించి షాక్ ఇచ్చింది.

ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. అలా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలను చేస్తోంది హోంబలే ఫిల్మ్స్. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో మూవీలు తీసి సందడి చేయనుంది. పలువురు హీరోలను లాక్ చేసి.. నార్త్ టు సౌత్ సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మైత్రి మూవీ మేకర్స్, తమిళ చిత్ర పరిశ్రమ నుంచి సన్ పిక్చర్స్, బాలీవుడ్ నుంచి YRF ఇప్పటికే వివిధ భాషలకు చెందిన స్టార్ల స్లాట్లను లాక్ చేసుకున్నాయి. ఇప్పుడు హోంబలే కూడా అదే పని చేస్తుంది. పలు ప్రాజెక్టుల షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. మొత్తానికి సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించేలా ఉంది.