హొంబాలే మరో గ్రాండ్ మూవీ.. పరశురామ్ పవర్ఫుల్ లుక్
ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే హొంబాలే ఫిలిమ్స్, ఇప్పుడు పురాణ గాథలను యానిమేషన్ రూపంలో వెండితెరపై మరింత పవర్ఫుల్ గా హైలెట్ చేసే పనిలో ఉంది.
By: M Prashanth | 19 April 2026 1:47 PM ISTఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే హొంబాలే ఫిలిమ్స్, ఇప్పుడు పురాణ గాథలను యానిమేషన్ రూపంలో వెండితెరపై మరింత పవర్ఫుల్ గా హైలెట్ చేసే పనిలో ఉంది. దశావతారాల నేపథ్యంతో ఒక భారీ యానిమేషన్ సినిమాటిక్ యూనివర్స్‌ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్ లో రెండో భాగంగా విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి కథను సిద్ధం చేస్తున్నారు.
లేటెస్ట్ గా విడుదలైన ‘మహావతార్ పరశురామ్’ ఫస్ట్ లుక్ చూస్తుంటే, హొంబాలే సంస్థ యానిమేషన్ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. నరసింహ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అశ్విన్ కుమారే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఒక యానిమేషన్ సినిమా ద్వారా పురాణాల్లోని రౌద్రాన్ని, ఎమోషన్ ని పక్కాగా ప్రజెంట్ చేయడం అశ్విన్ స్టైల్. అందుకే పరశురాముడి అవతారాన్ని కూడా అంతే పవర్ఫుల్ గా డిజైన్ చేసినట్లు పోస్టర్ లో అర్థమవుతోంది.
ధర్మ రక్షణ కోసం పరశు రాముడు పట్టుకున్న ఆ గొడ్డలి మీద రక్తం చిందినట్లు చూపించడం హైలెట్ అయ్యింది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో క్లీమ్ ప్రొడక్షన్స్ కూడా పాట్నర్. దశావతారాల్లోని ప్రతి ఘట్టాన్ని విజువల్ వండర్ లా చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ యానిమేషన్ సిరీస్ లో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని, అందులో పరశురామ్ కథ చాలా కీలకం కాబోతోందని సమాచారం. పౌరాణిక కథలను నేటి జనరేషన్ కి ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే యానిమేషన్ ఒక మంచి దారి అని మేకర్స్ భావిస్తున్నారు.
సామ్ సీఎస్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో మేజర్ హైలెట్ కానుందట. నరసింహ సినిమాలో విజువల్స్ కి మంచి గుర్తింపు రావడంతో, ఇప్పుడు పరశురామ్ మూవీ మీద అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కేవలం చిన్న పిల్లల కోసమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కథను నడిపించడంలో దర్శకుడు అశ్విన్ కుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ గత భాగం కంటే ఇంకా మెరుగ్గా ఉండబోతున్నాయని టాక్. హొంబాలే ఫిలిమ్స్ లాంటి పెద్ద సంస్థ వెనుక ఉండటంతో మార్కెటింగ్ పరంగా కూడా ఈ యానిమేషన్ చిత్రం అన్ని భాషల్లో భారీగా రిలీజ్ కానుంది.
2027 డిసెంబర్ లో ఈ ‘మహావతార్ పరశురామ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. నరసింహ తర్వాత వస్తున్న ఈ రెండో పార్ట్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. హొంబాలే సంస్థ ఇలాంటి ప్రయోగాత్మకమైన యానిమేషన్ చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. పురాణాల్లోని యుద్ధ వీరుల కథలు యానిమేషన్ స్క్రీన్ మీద చూస్తుంటే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఆ మ్యాజిక్ ని ఈ పరశురాముడు ఎంతవరకు రీక్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.
