Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కి స‌మ్మె సెగ‌..రోడ్డెక్కిన కార్మికులు..క‌ళాకారులు!

తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలంటూ హాలీవుడ్ సినీ కళాకారులు.. ప్రముఖ నటులు సమ్మె బాట పట్టారు

By:  Tupaki Desk   |   14 July 2023 7:02 AM GMT
హాలీవుడ్ కి స‌మ్మె సెగ‌..రోడ్డెక్కిన కార్మికులు..క‌ళాకారులు!
X

సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించి సమ్మెలు..రాస్తారోకోలా లాంటివి ఎక్కువ‌గా భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే వినిపిస్తుంటాయి. అందులోనూ ద‌క్ష‌ణాది నుంచి తెలుగు...త‌మిళ భాష‌ల్లో త‌రుచూ ఇలాంటి స‌మ్మె వ్య‌వ‌హారాలు తెర‌పైకి వ‌స్తుంటాయి. సినీ కార్మికులు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌ పై రోడ్లెక్కుతుంటారు. ముఖ్యంగా వేత‌నాలు పెంపు విష‌యం లో గిల్డ్ తో ఒప్పందం కుద‌ర‌ని ప‌క్షంలో ఇలాంటి స‌మ్మెలు తెర‌పైకి వ‌స్తుంటాయి. అయితే ఇలాంటి వాటి విష‌యం లో హాలీవుడ్ కూడా త‌క్కువేం కాద‌ని తెలుస్తోంది.

అగ్ర‌రాజ్యం అమెరికా లోనూ ఇలాంటి స‌మ్మె పొర‌లు క‌మ్ముకుంటాయ‌ని తాజా ఘ‌ట‌న‌తో చెప్పొచ్చు. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలంటూ హాలీవుడ్ సినీ కళాకారులు.. ప్రముఖ నటులు సమ్మె బాట పట్టారు. దాదాపు 1.6 లక్షల మంది సినీ కళాకారులు సభ్యులుగా ఉన్న 'స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్' నేతృత్వం లో ఈ సమ్మె జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి సమ్మె ప్రారంభమైంది. 1960 తరువాత హాలీవుడ్‌ లో ఈ స్థాయి సమ్మె జరగడం ఇదే తొలిసారి. ఒటీటీ విప్ల‌వం తెర‌పైకి రావ‌డం.. పెరిగిపోతున్న పారితోషికాలు... ముంచుకొస్తున్న కృత్రిమ మేధ ఉపద్రవం వంటికి ఈ స‌మ్మెకి ప్ర‌ధానంగా పురుడు పోసిన‌ట్లు తెలుస్తోంది.

త‌మ భ‌విష్య‌త్ ని కాపాడుకునేందుకే సమ్మె బాట పట్టినట్టు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పేర్కొంది. స్టూడియోలు.. ఓటీటీల‌ తో జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వ్వ‌డంతోనే యూనియ‌న్ రోడ్డెక్కిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ స‌మ్మె వారం రోజులుగానే జ‌రుగుతోందిట‌. సినీ రచయితలు పిక్కెట్ లైన్స్‌లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా వారికి తోడు గా న‌టీన‌టులు కూడా రోడ్డెక్క‌డంతో సీన్ మారింది.

హలీవుడ్ ప్రముఖులు మెరిల్ స్ట్రీప్.. జెన్నిఫర్ లారెన్స్ వంటి వారందరూ సమ్మె బాట పట్టిన కళాకారుల కు మద్దతుగా నిలిచారు. ఓటీటీలు రావ‌డంతో పారితోషికాల్లో కొత ప‌డిందంటున్నారు. అలాగే కృత్రిమ మేధ ప్ర‌వేశంతో సృజనాత్మకత పై ఆధారపడ్డ రంగాల అస్థిత్వానికే ముప్పు వచ్చి పడిందని' స్క్రీన్ యాక్టర్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది.