Begin typing your search above and press return to search.

భార్యలకు 33 ఏళ్లు వస్తే విడాకులు తీసుకునే హీరో!?

హాలీవుడ్‌లోని టాప్‌ స్టార్‌లలో టామ్‌ క్రూజ్ యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ అసాధార‌ణ‌మైన‌ది.

By:  Tupaki Desk   |   10 Sep 2023 11:49 AM GMT
భార్యలకు 33 ఏళ్లు వస్తే విడాకులు తీసుకునే హీరో!?
X

హాలీవుడ్‌లోని టాప్‌ స్టార్‌లలో టామ్‌ క్రూజ్ యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ అసాధార‌ణ‌మైన‌ది. సూపర్‌స్టార్ టామ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ మిషన్ ఇంపాజిబుల్ లో ఏడో భాగం విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ 7 లో అతడు సినిమా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ తో అద‌ర‌గొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 60 ప్ల‌స్ వ‌య‌సులో చావు క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూసేంత ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ తో అత‌డు సంచ‌ల‌నంగా మారాడు.

వృత్తిపరంగా అత‌డి చ‌రిత్ర ఎలా ఉన్నా కానీ.. టామ్ వ్యక్తిగత సంబంధాలలో చాలా విచిత్రమైన రిలేష‌న్స్ క‌లిగి ఉన్నాడనేది కొద్దిమందికే తెలుసు.టామ్ క్రూజ్ 33 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీని ఎన్నడూ వివాహం చేసుకోలేదు. అతడి మాజీ భార్యలలో ముగ్గురికి 33 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు... అతను విడాకుల కోసం దాఖలు చేశాడు. అతడు 1987లో మిమీ రోజర్స్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 33 ఏళ్లు వచ్చినప్పుడు 1990లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. తర్వాత అతను 1990 నుండి 2001 వరకు నికోల్ కిడ్‌మాన్‌ను.. 2006 నుండి 2012 వరకు కేటీ హోమ్స్‌ను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ 33 ఏళ్లు వచ్చేసరికి విడాకులు తీసుకున్నాడు.

కేవలం యాధృచ్చికం అని అనుకోక‌పోతే.. అతని భార్యలు ప్రతి ఒక్కరు మునుపటి కంటే 11 సంవత్సరాలు చిన్నవారు. 2023 నాటికి మిమీ రోజర్స్‌కు 66 ఏళ్లు, నికోల్ కిడ్‌మాన్‌కు 55 ఏళ్లు. కేటీ హోమ్స్‌కు 44 ఏళ్లు. కొంతమంది దీనిని పూర్తిగా యాధృచ్ఛికం అని భావించినప్పటికీ చాలా మంది వ్యక్తులు ఈ సంఖ్యలు .. నమూనాలు క్రూజ్ ఎక్కువ‌గా ఫాలో చేసే సైంటాలజీతో సంబంధం కలిగి ఉంటాయని నమ్ముతారు.