ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో రెండు చిత్రాల సెంచరీలు ఖాయం!
ఇండియాలో హాలీవుడ్ చిత్రాల హవా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ మార్కెట్ నుంచి 100 కోట్ల వసూళ్లు సాధించిన ఇంగ్లీష్ సినిమాలెన్నో ఉన్నాయి.
By: Tupaki Desk | 10 July 2025 7:00 PM ISTఇండియాలో హాలీవుడ్ చిత్రాల హవా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ మార్కెట్ నుంచి 100 కోట్ల వసూళ్లు సాధించిన ఇంగ్లీష్ సినిమాలెన్నో ఉన్నాయి. 'ది జంగిల్ బుక్', 'అవెంజర్స్: ఎండ్ గేమ్', 'లయన్ కింగ్ ', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7', 'జురాసిక్ వరల్డ్', 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్', 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్', 'అవెంజెర్స్ ఇన్పినిటీ వార్', 'అవతార్ ది వేఆఫ్ వాటర్' లాంటి చిత్రాలెన్నో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెంచరీలు కొట్టిన చిత్రాలే.
తాజాగా ఈ జాబితాలోకి చేరడానికి మరో హాలీవుడ్ మూవీ సిద్దంగా ఉంది. ఇటవలే బ్రాడ్ ఫిట్ నటించిన 'ఎఫ్ 1' భారతీయ మార్కెట్ లో కి వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 27న భారీ ఎత్తున ఈ సినిమా భారత్ లో జరిగింది. ఈ సినిమా ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 2656 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇండి యాలోనే ఇప్పటి వరకూ 70 కోట్ల మార్క్ ను దాటింది. దీంతో ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను భారత్ మార్కెట్ నుంచి కూడా సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమా చాలా చోట్ల రిలీజ్ కాలేదు. ప్రధాన పట్టణాల్లో కొన్ని చోట్ల అందుబాటులో లేదు. రేర్ గా థియేటర్లు కేటాయించడంతో తెలుగు లో ఈ సినిమా గురించి జనాలకు పెద్దగా తెలియలేదు. ఫార్ములా వన్ లాంటి సినిమాలు పెద్దగా చూడరని అనువాదం కాలేదు. లేదంటే ఇప్పటికే 100 కోట్లను ఈజీగా దాటేసేది. ఈ సినిమాతో పాటు మరో హాలీవుడ్ చిత్రం 'జురాసిక్ వరల్డ్: రీబర్త్' కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కూడా గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఈ చిత్రం తెలుగు అనువాదంలో అందుబాటులో ఉంది. తెలుగు సినిమాల కంటే జనాలంతా ఈసినిమాకే ఎక్కుగా వెళ్తు న్నారు. థియేటర్లన్నీ కిట కిటలా డుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కూడా 60 కోట్లకు పైగా భారత్ మార్కెట్ నుంచి సాధించింది. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 45 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్ గా చూస్తే `ఫార్ములా వన్` కంటే `జురాసిక్ వరల్డ్ రీ భర్త్` అధిక వసూళ్లను సాధించింది. ఇండియా నుంచి ఈ సినిమా కూడా 100 కోట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
