Begin typing your search above and press return to search.

హిట్ మూవీ సీక్వెల్‌, రీమేక్ ఒకేసారి...!

తాజాగా రైడ్ కి సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టి సిరీస్ అధినేత భూషన్ కుమార్‌ మరి కొందరు నిర్మాతలు కలిసి రైడ్ సినిమా సీక్వెల్‌ పనిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 5:13 AM GMT
హిట్ మూవీ సీక్వెల్‌, రీమేక్ ఒకేసారి...!
X

ఈ మధ్య కాలంలో సూపర్ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్ చేయడం పరిపాటిగా మారింది. హిట్ కాంబినేషన్ రిపీట్ చేయడంతో పాటు, హిట్‌ కాన్సెప్ట్‌ ను రిపీట్ చేయడం ద్వారా హిట్‌ ఛాన్స్ ఎక్కువ అనే ఉద్దేశ్యంతో చాలా మంది సీక్వెల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం కూడా మనం రెగ్యులర్‌ గా చూస్తూనే ఉన్నాం. అయితే ఒక హిట్‌ సినిమాకు ఒకే సారి రీమేక్ మరియు సీక్వెల్ రూపొందడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రైడ్‌ సినిమా కి అదే జరుగుతోంది.

అయిదేళ్ల క్రితం హిందీలో వచ్చిన అజయ్ దేవగన్‌ 'రైడ్‌' సినిమా కి రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ మొదలు అయిన విషయం తెల్సిందే. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్‌ తో రూపొందబోతున్న ఈ రీమేక్ పై ప్రకటించిన సమయం లోనే విపరీతమైన అంచనాలు పెరిగాయి.

తాజాగా రైడ్ కి సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టి సిరీస్ అధినేత భూషన్ కుమార్‌ మరి కొందరు నిర్మాతలు కలిసి రైడ్ సినిమా సీక్వెల్‌ పనిలో ఉన్నారు. రైడ్‌ మూవీ లోని అమేయ్‌ పట్నాయక్ పాత్రను సీక్వెల్‌ లో కొనసాగించబోతున్నట్లుగా తాజా పోస్టర్‌ లో అధికారికంగా వెళ్లడించడం జరిగింది.

రైడ్‌ సినిమా సీక్వెల్‌ హిట్‌ అయితే ప్రస్తుతం రీమేక్‌ చేస్తున్న రవితేజ, హరీష్ శంకర్ లు వెంటనే సీక్వెల్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే హిట్‌ మూవీ రీమేక్ మరియు సీక్వెల్‌ లు రాబోతున్నాయని తెలుస్తోంది.