Begin typing your search above and press return to search.

విజయ్ ఆంటోని హిట్లర్ టీజర్ టాక్..!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని తన కొత్త సినిమా హిట్లర్ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు

By:  Tupaki Desk   |   27 Dec 2023 9:34 AM GMT
విజయ్ ఆంటోని హిట్లర్ టీజర్ టాక్..!
X

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని తన కొత్త సినిమా హిట్లర్ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ధన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. విజయ్ ఆంటోని హిట్లర్ టీజర్ రీసెంట్ గా రిలీజైంది. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజయ్ లుక్, ట్విస్ట్, యాక్షన్ ఇవన్ని హిట్లర్ సినిమాపై హైప్ తెచ్చాయి.

సినిమాలో గౌతమ్ వాసుదేవ మీనన్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. టీజర్ లో కథ అంతగా రివీల్ చేయకపోయినా విజయ్ ఆంటోని నుంచి ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా హిట్లర్ వస్తుందని తెలుస్తుంది. బిచ్చగాడు సినిమా నుంచి విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.

బిచ్చగాడు తెలుగులో సెన్సేషనల్ హిట్ కాగా ఆ తర్వాత విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో మంచి బజ్ క్రియేట్ చేశాయి. బిచ్చగాడు 2 సినిమా కూడా తెలుగులో మంచి ఫలితాన్ని అందుకుంది. మధ్యలో సినిమాలు నిరాశపరిచినా విజయ్ మాత్రం తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

హిట్లర్ సినిమా విజయ్ కంటెంట్ బేస్డ్ సినిమాకు భిన్నంగా పొలిటికల్ టచ్ తో కమర్షియల్ మూవీగా వస్తుంది. ఈ సినిమా టీజర్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. ఈ మూవీలో విజయ్ ఆంటోని సరసన రియా సుమన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు వివేక్ అండ్ మెర్విన్ ఇద్దరు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

కోలీవుడ్ లో సరికొత్త కథ కథనాలతో ప్రత్యేకమైన సినిమాలు చేస్తున్న విజయ్ ఆంటోని తమిళ ప్రేక్షకులతో పాటుగా తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. విజయ్ ఆంటోని సినిమా వస్తుంది అంటే ఈసారి ఎలాంటి కథతో వస్తాడో అన్న ఎగ్జైట్మెంట్ మొదలైంది. హిట్లర్ టీజర్ విజయ్ మాస్ యాంగిల్ ని చూపిస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. హిట్లర్ అనగానే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గుర్తొస్తుంది. ఈమధ్య మెగాస్టార్ సినిమా టైటిల్స్ ని వాడేస్తున్నారు తమిళ హీరోలు. కార్తి ఖైదీ తో రాగా విజయ్ మాస్టర్ టైటిల్ తో వచ్చారు. ఇప్పుడు హిట్లర్ అంటూ విజయ్ ఆంటోని వస్తున్నాడు.